Google Gemini నానో బనానా AI మోడల్ గత మూడు వారాల నుంచి ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ AI మోడల్ కు ముందు నెటిజన్స్ చాట్‌జిపిటి గిబ్లి ఫొటోలపై ఫోకస్ చేశారు. తమ ఫొటోలను గిబ్లీ స్టైల్‌లోకి మార్చి తమ సోషల్ అకౌంట్లలో పోస్ట్ చేసుకున్నారు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఫ్లాష్ ఇమేజ్ మోడల్ 2.5ను ముద్దుగా నానో బనానా AI మోడల్‌గా పిలుచుకుంటున్నారు. మీ ఫొటోను మరింత అందంగా, ఆకర్షణీయంగా చేసేందుకు నానో బనానా ఏఐ మోడల్‌ను తెగ వాడేస్తున్నారు. 

Continues below advertisement

నానో బనానా AIని మరింత అందుబాటులోకి తేవడానికి, AI స్టార్టప్ పర్‌ప్లెక్సిటీ AIని వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అచ్చమైన  3D చిత్రాన్ని సైతం టూల్ తయారుచేస్తుంది. తాజాగా ఈ AI మోడల్ వాట్సాప్‌లోకి వస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో వినియోగిస్తున్న మెటా AI, జెమిని లేదా నానో బనానా మోడల్‌కు అంత సమానంగా లేదు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఏఐ జనరేటెడ్ యాప్స్ బాగా వినియోగిస్తున్నారు.

వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్‌లో నానో బనానా ఏఐ టూల్  ఉపయోగించవచ్చు అని Perplexity ప్రకటించింది. ఈ AI స్టార్టప్ గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇంజిన్‌ను పర్‌ప్లెక్సిటీ బాట్‌లో జత చేసింది. ఈ సంస్థ వినియోగదారులు ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ ఏఐ మోడల్‌ను డైరెక్ట్‌గా మెటాకు చెందిన ప్లాట్‌ఫారం వాట్సాప్ లో ఉపయోగించవచ్చని ఎక్స్‌లో తెలిపింది. Perplexity సహ-స్థాపకుడు, CEO అరవింద్ శ్రీనివాస్ ఈ పోస్ట్‌ను రీషేర్ చేశారు.

Continues below advertisement

వాట్సాప్‌లో నానో బనానా ఎలా ఉపయోగించాలి?వినియోగదారులు తమ ఏఐ ఫొటోలు, త్రీడీ ఫొటోల కోసం జెమిని లేదా గూగుల్ AI స్టూడియోకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లో AI టూల్ ఉపయోగించడానికి, మీరు Perplexity AI botతో చాట్ చేయాలి. పర్‌ప్లెక్సిటీ వాట్సాప్ నెంబర్ +1 (833) 436-3285 pp నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.https://lnkd.in/p/g_KzCJcp

మీరు చాట్ (సంభాషణ) ప్రారంభించాక ఒక ఫొటో సెండ్ చేయాలి. దాన్ని ఎలా మార్చాలని మీరు కోరుకుంటున్నారో మీకు ఇష్టమైన ప్రాంప్ట్‌ను ఇవ్వవచ్చు. నానో బనానా వివరణాత్మకమైన ప్రాంప్ట్‌లతో మీకు ఖచ్చితమైన ఫొటోలను క్రియేట్ చేసి ఇస్తుంది. ఐకానిక్ సారీ ట్రెండ్ లేదా 4K రెట్రో పోర్ట్రెట్ ఇలా ఏదైనా కావొచ్చు, ఈ మోడల్ గూగుల్ యాప్‌లలో నేరుగా మీకు కావాల్సిన ఫొటోలను క్రియేట్ చేస్తుంది.

ఉదాహరణకు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలంటే..“మీకు ఓ చిన్నారి చేతిలో టెడ్డీ బేర్ ఉండాలని, నవ్వుతూ కనిపించాలి. టెడ్డీ బేర్ ఆకారంతో పాటు బాలిక ధరించే దుస్తుల రంగు లాంటి వివరాలు ఇవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్, చిన్నారి కూర్చుని ఉండాలా, లేక నిల్చున్నట్లు కనిపించాలో ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఆ ప్రాంప్ట్ ద్వారా వాట్సాప్ లో నానా బనానా ఏఐ ఇమేజ్ జనరేట్ అవుతుంది.

నానో బనానా వాట్సాప్‌లో ఉచితమా..తమ బాట్ ద్వారా వాట్సాప్‌లో నానో బనానా ఉచితంగా ఇస్తున్నారో లేదో Perplexity క్లారిటీ ఇవ్వలేదు. గూగుల్ లిమిటెడ్ ఫ్రీ సర్వీస్ మాత్రం అందిస్తుంది. పేమెంట్ చేసిన సబ్‌స్క్రైబర్లకు ఇది మరింత ఉపయోగపడుతుంది. Perplexity botతో చాట్ చేసి మీకు కావాల్సిన ఫొటోను ప్రాంప్ట్ ద్వారా పొందవచ్చు. లేదా మీరు ఇచ్చిన ఫొటోను నానో బనానా ఇమేజ్‌గా మార్చుతుంది.

భారత్‌లో నానో బనానా ఏఐ ఫొటోలను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. గూగుల్ ప్రకారం, యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లో జెమిని యాప్ టాప్‌లో ఉంది. వాట్సాప్‌లో నానో బనానా ఫీచర్ అందుబాటులోకి వస్తే వీటిని మరింత ఉపయోగించనున్నారు. గూగుల్ దీనిపై చర్యలు చేపట్టింది.