షియోమీ 12ఎస్ ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను కూడా ఇందులో అందించారు. కెమెరాలు, పెర్ఫార్మెన్స్ ప్రధానంగా ఈ ఫోన్‌ను షియోమీ రూపొందించింది.త


షియోమీ 12ఎస్ ప్రో ధర
ఇందులో నాలుగు వేరియంట్లు షియోమీ లాంచ్ చేసింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,699 యువాన్లుగా (సుమారు రూ.55,400) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.58,900), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,399 యువాన్లుగానూ (సుమారు రూ.63,700) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,899 యువాన్లుగా (సుమారు రూ.69,500) నిర్ణయించారు.


షియోమీ 12ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై షియోమీ 12ఎస్ ప్రో పనిచేయనుంది. ఇందులో 6.73 అంగుళాల 2కే కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో అందించారు.


12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా... బరువు 203 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్707 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఐఆర్ బ్లాస్టర్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్ కాగా... 120W వైర్డ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌ను షియోమీ 12ఎస్ ప్రో సపోర్ట్ చేయనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!