వివో టీ2 5జీ స్మార్ట్ ఫోన్ జూన్ 6వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. ఇప్పుడు తాజాగా వస్తున్న కథనాల ప్రకారం... వివో టీ2ఎక్స్ కూడా జూన్ 6వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. వివో టీ2తో పాటు టీ2ఎక్స్ కూడా మార్కెట్లో లాంచ్ కానుంది.


దీని ధర కూడా లీకైంది. ఈ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం... 1,000 యువాన్ల (సుమారు రూ.11,500) రేంజ్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర ఉండనుంది. బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్ ప్రధానంగా ఈ ఫోన్ రూపొందించినట్లు తెలుస్తోంది. దీని స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


వివో టీ2ఎక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం... ఇందులో 6.58 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. దీని మందం 0.92 సెంటీమీటర్లు గానూ, బరువు 202 గ్రాములుగానూ ఉంది.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుందని సమాచారం. దీంతోపాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. ఏకంగా 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండనుంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


వివో టీ2 5జీ ఫీచర్లు
వివో టీ2 5జీ ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు.


ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఓషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, వైఫై6, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!