ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో బుధవారం తన T సిరీస్‌ను Vivo T1 ప్రో 5G , Vivo T1 44W మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ల ధరలు రూ. 23,999 , రూ. 14,499 తో ప్రారంభం అవుతాయి. వీటిలో Vivo T1 ప్రో 5G మోడల్ ప్రి బుకింగ్ మే 5 నుండి చేసుకోవచ్చు. 7 ఉదయం 12 గంటల నుండి అమ్మకానికి వస్తుంది. Vivo T1 44W మోడల్ మే 8 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్ముతారు. Vivo ఇండియా స్టోర్స్‌లో అమ్ముతారు. అలాగే వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ తో పాటు కంపెనీ అథరైజ్డ్ రిటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉటాయి.
Vivo T1 Pro 5G టర్బో బ్లాక్ , టర్బో సియాన్ రంగులలో విడుదల చేస్తున్నారు. Vivo T1 44W మూడు రంగులు మిడ్‌నైట్ గెలాక్సీ, స్టార్రీ స్కై , ఐస్ డాన్ కలర్స్‌లో విడుదల చేస్తున్నారు. Vivo T1 Pro 5G కూడా 8GB + 128 GB మోడల్‌కు రూ. 24,999 ధర నిర్ణయించారు. Vivo T1 44W 6GB + 128 GB మోడల్‌కు రూ. 15,999, 8GB + 128 GB వేరియంట్‌కు రూ. 17,999 ధర నిర్ణయించారు.
Vivo T1 Pro 5G , Vivo T1 44W స్పెక్స్ మరియు ఫీచర్లు అత్యాధునికంగా ఉన్నాయి. Vivo T1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది . వివో T1 44W స్నాప్‌డ్రాగన్ 680 SoCని ఉపయోగించారు. Vivo T1 Pro 5G ఏడు 5G బ్యాండ్‌లు , లెవెల్-8 లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో సిద్ధం చేశారు. ఇది 32,923 mm ప్రాంతాన్ని కవర్ చేస్తుంది, ఇది కోర్ CPU ఉష్ణోగ్రతను 12 °C తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది.
Vivo T1 ప్రో 6.44-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 6 :1 మిలియన్ కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 60Hz .. టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz సామర్థ్యంతో ఉంది. Vivo T1 కూడా 6.44-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది . రెండు మోడల్‌లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత FuntouchOS తో వస్తున్నాయి. Vivo T1 Pro 5G , Vivo T1 రెండూ RAM 2.0ని కలిగి ఉన్నాయి. ఇది మోడల్‌పై ఆధారపడి 4GB వరకు RAM విస్తరణను అందిస్తుంది.
కెమెరా పరంగా చూస్తే Vivo T1 Pro 5G 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ , 2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది, Vivo T1 44W 50MP ప్రైమరీ, 2MP మాక్రో సెన్సార్ , 2MP బోకె కెమెరాను కలిగి ఉంది. Vivo T1 ప్రో 5G 66W టర్బో-ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీ ఉంటుంది. Vivo T1 44W కి 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుది.