సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 3 స్మార్ట్ ఫోన్ జపాన్‌లో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 4జీ ఫోన్ కాగా... ఈ ఫోన్‌లో 5జీని అందించారు. సోనీ లాంచ్ చేసిన అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 3 ధర
ఈ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 34,408 జపనీస్ యెన్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.20,500) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, బ్రిక్ ఆరెంజ్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జూన్‌లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం అయ్యాయి. మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.
సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 3 ఫీచర్లు
ఇందులో 5.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఫ్రంట్ కెమెరా కోసం అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ68 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 5జీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా అందించారు.
సోనీ ఇటీవలే తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే సోనీ ఎక్స్‌పీరియా 1 ఐవీ. ఇందులో 6.5 అంగుళాల 4కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 21:9 యాస్పెక్ట్ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!