శాంసంగ్ ఇటీవలే మనదేశంలో గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో గెలాక్సీ ఎస్22 మోడల్లో పింక్ గోల్డ్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను శాంసంగ్ ఇప్పుడు మనదేశంలోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ లుక్ చూడటానికి చాలా అందంగా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మనదేశంలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.76,999గా ఉంది. గ్రీన్, ఫాంటం బ్లాక్, ఫాంటం వైట్, పింక్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌ను కూడా ఉంది. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను శాంసంగ్ అందించింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.


ఇక కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 


యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1పై శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 168 గ్రాములుగా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!