రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ మనదేశంలో శుక్రవారం (ఆగస్టు 26వ తేదీ) లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లను కంపెనీ పూర్తిగా రివీల్ చేసింది. అయితే చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దీని ఫీచర్లు పూర్తిగా వేరుగా ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ ఇండియా లాంచ్ వివరాలు
రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఆగస్టు 26వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు 31వ తేదీన జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని రెడ్‌మీ లాంచ్ చేయనుంది.
బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, షాడో బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధరను కూడా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.12 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
రెడ్‌మీ నోట్ 10ఎస్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈలో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
డ్యూయల్ స్పీకర్లు, హైరిజల్యూషన్ ఆడియో వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. 4జీ, వైఫై, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి.
రెడ్‌మీ కే50 అల్ట్రా ఇటీవలే లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. దీని ధర 2,999 యువాన్ల (సుమారు రూ.35,400) నుంచి ప్రారంభం కానుంది. రెడ్‌మీ కే50 అల్ట్రాలో 6.7 అంగుళాల 12 బిట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంను రెడ్‌మీ కే50 అల్ట్రాలో అందించారు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!