ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ OnePlus మరిన్ని లేటెస్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అందులో భాగంగానే OnePlus 11 సిరీస్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.  ఈ సిరీస్‌లో OnePlus 11 ప్రో, OnePlus 11ఆర్, OnePlus 11టీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎన్ని ఫోన్లు విడుదల అవుతాయి అనేది పక్కన పెడితే.. ఈ సిరీస్ కు సంబంధించిన ఫోన్ల ఫీచర్లు లీక్ అవుతున్నాయి. తాజాగా OnePlus 11ఆర్ ఫీచర్లు వివరాలు లీక్ అయ్యాయి. MySmartPrice నివేదిక ప్రకారం.. OnePlus 11R Qualcomm Snapdragon 8+ Gen 1 SoCతో వచ్చే అవకాశం ఉంది.


OnePlus 11R స్పెసిఫికేషన్లు


OnePlus 11R స్మార్ట్‌ ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080 x 2412 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ తో రానుంది. MediaTek డైమెన్సిటీ 8100 SoC నుంచి అప్‌ డేట్‌ వెర్షన్ గా, Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్‌ ను OnePlus 11R రానున్నట్లు తెలుస్తున్నది. ఇది 8GB, 16GB RAM ఎంపికలతో పాటు 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది.


ఇక OnePlus 11R కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్,  2MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.  OnePlus 11R 11W Super VOOC ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు చేసే 5,000 mAh బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తున్నది. OnePlus  కంపెనీ 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేయడం ఇదే మొదటిసారి.






 


OnePlus 11Pro స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్


OnePlus 11 సిరీస్ కు సంబంధించిన  OnePlus 11Pro  స్మార్ట్‌ ఫోన్ స్పెసిఫికేషన్లు సైతం ఇప్పటికే ఆన్‌ లైన్‌లో లీక‌య్యాయి. స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ తో రానున్నట్లు తెలుస్తున్నది. 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ రిజ‌ల్యూష‌న్‌ తో కూడిన‌ AMOLED డిస్ ప్లే ఉంటుదని పలు నివేదికలు వెల్లడించాయి. 100WT ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ తో 5,000 mAh బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో రానుంది.  50 MP ప్రైమ‌రీ కెమెరా, 48 MP అల్ట్రావైడ్ సెన్స‌ర్‌, 2x ఆప్టిక‌ల్ జూమ్‌తో 32 MP టెలిఫోటో సెన్స‌ర్ ఉంటుంది.  సెల్ఫీల కోసం 16 MP కెమెరా ఉంటుదని తెలుస్తోంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగ‌ర్‌ ప్రింట్ స్కాన‌ర్‌ తో పాటు డాల్బీ అట్మాస్‌ను స‌పోర్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నది.  ఈ లేటెస్ట్ ఫోన్లు 5G సపోర్టుతో రానున్నాయి.