నథింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తన మొదటి స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ ఫోన్‌పై టెక్నాలజీ లవర్స్‌లో ఎంతో హైప్ ఉంది. ఈ హైప్‌ను అందుకోవాలంటే నథింగ్ మిగతా స్మార్ట్ ఫోన్ల కంటే ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను డిజైన్ చేయాల్సి ఉంది. ఈ ఫోన్ ధర, లాంచ్ తేదీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


జులై 21వ తేదీన నథింగ్ మొదటి స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీనికి నథింగ్ ఫోన్ (1) అని పేరు పెట్టనున్నట్లు కంపెనీ గతంలోనే అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం ఒక యూరోపియన్ డీలర్ ద్వారా బయటకు వచ్చింది.


ఈ స్మార్ట్ ఫోన్ ధర 500 యూరోల (సుమారు రూ.41,300) రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మొదటి టీజర్ ప్రకారం ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఇది లాంచ్ కానుందని మాత్రం అంచనా వేయవచ్చు.


కొన్ని వారాల క్రితం నథింగ్ ఫోన్ (1)లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ కూడా వచ్చింది కాబట్టి ఆ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


మనదేశంలో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. యూకేలో ఓ2, జర్మనీలో డ్యూష్‌ల్యాండ్‌‌లతో కూడా ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం చేసుకుంది. ఈ వెబ్‌సైట్లలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ జరగనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!