ఐకూ 9 సిరీస్ మనదేశంలో ఈ సంవత్సరం మార్చిలోనే లాంచ్ అయింది. ఇందులో ఐకూ 9, ఐకూ 9 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐకూ 9టీని కూడా కంపెనీ మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి ప్రస్తుతానికి మనదగ్గర సమాచారం చాలా తక్కువగా ఉంది. 


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌తో మనదేశంలో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ ఇదే కావచ్చు. దీని ముందువెర్షన్ కంటే 10 శాతం వేగంగా ఈ ప్రాసెసర్ పనిచేయనుంది. 91మొబైల్స్ కథనం ప్రకారం.. ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులైలో లాంచ్ కానుంది.


ఐకూ 9 సిరీస్‌లో ఇప్పటికే ఐకూ 9, ఐకూ 9 ప్రో, ఐకూ 9 ఎస్ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐకూ 9టీ నాలుగో స్మార్ట్ ఫోన్ కానుంది. ఇందులో అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఐకూ 9టీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేయనుందని తెలుస్తోంది. అంటే ఐకూ 9 ప్రో కంటే మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను ఈ ఫోన్ అందించనుంది.


120W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉండనుందని తెలుస్తోంది. అయితే దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీ ఇంకా తెలియాల్సి ఉంది. ఐకూ 9ప్రోలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు.


12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌లో ఉండనుందని సమాచారం. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!