Google Pixel Fold: గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. వచ్చే ఏడాది Q1లో లాంచ్!

గూగుల్ తొలి ఫోల్డబుల్ హ్యాండ్‌ సెట్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. వచ్చే ఏడాది Q1లో దీన్ని లాంచ్ చేయబోతున్నది

Continues below advertisement

Google నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ విడుదలకానుంది. తాజాగా Pixel-బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.  తాజాగా  నిర్వహించిన  మేడ్ బై గూగుల్ లాంచ్ ఈవెంట్‌ లో గూగుల్ కంపెనీ పిక్సెల్ 7 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి స్మార్ట్ వాచ్(పిక్సెల్ వాచ్‌)ను ఆవిష్కరించింది.  ఇదే ఈవెంట్ లో గూగుల్ యొక్క ఫోల్డబుల్ స్మార్ట్‌ ఆవిష్కరణ ఉంటుందని స్మార్ట్ ఫోన్ లవర్స్ భావించారు. కానీ, కంపెనీ ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌ ను వచ్చే ఏడాది లాంచ్ చేయాలని నిర్ణయించింది. 

Continues below advertisement

2023 Q1లో Pixel Fold లాంచ్

డిస్ ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (DSCC) CEO రాస్ యంగ్ అభిప్రాయం ప్రకారం.. మొదటి పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ 2023 Q1 లో రావచ్చని తెలుస్తున్నది.  పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ కు సంబంధించిన వివరాల గురించి అడుగుతూ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ (@rquandt) చేసిన ట్వీట్‌ కు యంగ్ రిప్లై ఇచ్చారు. 2023 Q1లో Google కంపెనీకి సంబంధించిన తొలి ఫోల్డబుల్ హ్యాండ్‌ సెట్ రావచ్చని వెల్లడించారు.  జనవరిలో కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ కోసం ప్యానెల్ షిప్‌మెంట్‌లను స్వీకరించడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.  గూగుల్ రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌లపై పని చేస్తుందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. 

Pixel Fold స్పెసిఫికేషన్లు

Googleకు సంబంధించిన ఆండ్రాయిడ్ 13 Quarterly Platform Release 1 (QPR1) బీటా నుంచి కోడ్ లైన్‌ లో 'ఫెలిక్స్' అనే ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ ప్రస్తావనను డెవలపర్లు గుర్తించారు.  ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ IMX787 ప్రైమరీ సెన్సార్, IMX386 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్,  S5K3J1 టెలిఫోటో లెన్స్‌ తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. దీని ఔటర్ డిస్‌ప్లే S5k3J1 టెలిఫోటో సెల్ఫీ కెమెరాను పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7.57-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేతో పాటు 5.78-అంగుళాల అల్ట్రా-థిన్ గ్లాస్ కవర్‌ తో ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, గూగుల్ నుండి 'పిపిట్' అనే కోడ్‌ నేమ్‌ తో ఫోల్డబుల్ ఫోన్ కూడా వచ్చింది. ఈ మోడల్‌ లో ఫీచర్ చేసిన టెన్సర్ SoC ఇప్పుడు పాతదిగా మారిందని డెవలపర్లు వెల్లడించారు.

పిక్సెల్ ఫోల్డ్/ పిక్సెల్ నోట్‌ ప్యాడ్ గా నామకరణం

గూగుల్ యొక్క ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ కు పిక్సెల్ ఫోల్డ్ లేదంటే  పిక్సెల్ నోట్‌ ప్యాడ్ అని పేరు పెట్టవచ్చని తాజా  నివేదిక వెల్లడించింది. ఇది చైనాలోని ఫాక్స్‌ కాన్‌  ద్వారా తయారు చేయబడుతుందని తెలిపింది. ఈ స్మార్ట్‌ ఫోన్ లాంచ్ ఈ ఏడాది  మేలోనే జరగాల్సి ఉండగా ఆలస్యం అయినట్లు వివరించింది.

Continues below advertisement