దేశంలో 5జీ సేవలో ప్రారంభం కాబోతున్నాయి. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఇప్పటికే 5జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే.. దేశంలో ఇప్పటికీ  4G, 3G కూడా సరిగ్గా పని చేయని ప్రాంతాలు చాలా ఉన్నాయి. పలు చోట్ల నెట్ సరిగారాక.. వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతారు. అత్యవసర పరిస్థితుల్లోనూ నెట్ రాకపోతే చిరాకు అనిపిస్తుంది. ఆ సమయంలో కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే సమస్య సాల్వ్ అయి.. నెట్ వేగంగా వస్తుంది. ఈ టిప్స్ పాటించండి.


ఎరోప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి


నెట్ సరిగా రాని సమయంలో మొబైల్ డేటా వేగాన్ని పెంచడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి. మీరు కేవలం ఎరోప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి, కొన్ని సెకన్ల తర్వాత దాన్ని ఆఫ్ చేయవచ్చు. ఇలా చేయడంతో మొబైల్ నెట్‌ వర్క్‌ త్వరగా రీసెట్ అవుతుంది. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ సరిగా పని చేస్తుంది. నెట్ వేగంగా వస్తుంది. 


మొబైల్ నెట్‌వర్క్‌ను ఆటోకు సెట్ చేయండి


మొబైల్ డేటా నెట్‌వర్క్‌లు SIM ఆధారంగా మూడు, అంతకంటే తక్కువ నెట్‌వర్క్ ఎంపికలను అందిస్తాయి. వాటిలో 2G, 3G,  4G ఉంటాయి. కొన్ని సందర్భాల్లో  4G నెట్‌వర్క్ అందుబాటులో ఉండవచ్చు. కానీ  2G/3G నెట్‌వర్క్ మంచి వేగాన్ని అందించవచ్చు. సెట్టింగ్‌లలో మొబైల్ డేటా  విభాగానికి వెళ్లి 2G/3G/4G ఆటోకు మారాలి.  ఈ సెట్టింగ్ ద్వారా అందుబాటులో ఉన్న మంచి నెట్‌వర్క్‌ను గుర్తించి అందిస్తుంది. డేటా స్పీడ్‌ పెంచుతుంది.


మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి


మనలో చాలా మంది ఇదే చేస్తారు. మోబైల్ రీ స్టార్ట్ చేయడం మూలంగా నెట్వర్కింగ్ తో సహా సిస్టమ్  పూర్తిగా రీస్టార్ట్ అవుతుంది. నెట్వర్క్ కు సంబంధించిన సమస్యలు తొలగిపోయి.. స్పీడ్ గా నెట్ వస్తుంది.


సిమ్ కార్డ్‌ని  క్లీన్ చేయండి


SIM కార్డ్ దాని పోర్ట్‌లోకి వెళ్లినప్పుడు దుమ్ము పట్టుకుంటుంది. అప్పుడు నెట్ తో పాటు కాల్స్ కు సంబంధించి సమస్యలు వస్తాయి. ఆ సమయంలో సిమ్ కార్డును బయటకు తీసి గుడ్డతో క్లీన్ చేయాలి. మళ్లీ ఇన్ సర్ట్ చేయాలి. అప్పుడు నెట్వర్క్ స్పీడ్ గా పనిచేస్తుంది.   


APNని రీసెట్ చేయండి


ఈ విధానం ద్వారా నెట్ స్పీడ్ గా పని చేస్తుంది. ఇందుకోసం నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి..  ప్రొవైడర్ పేరుపై క్లిక్ చేయాలి. యాక్సెస్ పాయింట్ నేమ్స్  ఎంపిక చేసుకోవాలి.  'రీసెట్ యాక్సెస్ పాయింట్స్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. మోబైల్ ను రీస్టార్ట్ చేసి డేటా వాడుకోవాలి.  


నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి


మోబైల్ ను ఫ్యాక్టరీ రీసెట్  లేదంటే ఫార్మాటింగ్ లాగానే, చాలా ఫోన్లు నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇందుకోసం సెట్టింగ్‌లు, బ్యాకప్, రీసెట్ మెనుకి వెళ్లాలి. తర్వాత, రీసెట్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు నెట్ బాగా వస్తుంది.   


మొబైల్ డేటా పరిమితిని చూడండి


నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి, డేటా వినియోగాన్ని చూడాలి.  డేటా పరిమితి ఎంపిక ఉంటుంది. దాన్ని నిలిపివేయాలి.