జియో దాదాపు ఒక నెల నుండి దాని ట్రూ 5G నెట్‌వర్క్‌ను దేశంలో దశల వారీగా రోల్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాల్లో ట్రూ 5G కవరేజీని అందించడం ద్వారా జియో కొత్త రికార్డు సృష్టించింది. భారతదేశంలో 100 శాతం జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో జియో ట్రూ 5G కవరేజీని పొందిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.
జియో గుజరాత్‌లో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఇండస్ట్రీ 4.0, IOT రంగాలలో ట్రూ 5G ఆధారిత కార్యక్రమాల శ్రేణిని ప్రారంభించి, ఆపై దేశవ్యాప్తంగా విస్తరించనుంది. 'ఎడ్యుకేషన్-ఫర్-అల్' అనే ట్రూ 5జీ ఆధారిత కార్యక్రమాలతో ఇది ప్రారంభమవుతుందని తెలుస్తోంది. గుజరాత్‌లోని 100 పాఠశాలలను మొదట డిజిటలైజ్ చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి పని చేస్తున్నాయని రిలయన్స్ జియో తెలిపింది.
గుజరాత్‌లో జియో 5జీ లభ్యత
గుజరాత్‌లోని జియో వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు జియో వెల్‌కమ్ ఆఫర్‌కు అర్హులు అవుతారు. దానికి వారి దగ్గర 5జీని సపోర్ట్ చేసే ఫోన్ ఉంటే సరిపోతుంది.
జియో 5జీ అందుబాటులో ఉన్న నగరాలు
గుజరాత్‌తో పాటు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్, మరిన్ని రాష్ట్రాలలో జియో 5జీ ఇప్పటికే అందుబాటులో ఉంది. జియో వెల్‌కమ్ ఆఫర్ అక్టోబర్ ప్రారంభంలో మొదలయింది. జియో తాను ఇన్వైట్ చేసిన కస్టమర్‌లను True 5G సేవలను ట్రయల్ చేయడానికి, ఫీడ్ బ్యాక్ అందించడానికి ఉపయోగపడుతుంది.
ఒక నగరంలో నెట్‌వర్క్ కవరేజ్ పూర్తయ్యే వరకు వినియోగదారులు బీటా ట్రయల్‌ని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, 'జియో వెల్‌కమ్ ఆఫర్'కి ఆహ్వానం పొందిన వినియోగదారులు తమ ప్రస్తుత జియో SIM లేదా 5జీ హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా జియో True 5G సేవకు అప్‌గ్రేడ్ అవుతారు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?