Itel Pad 1: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్ ఐటెల్ మనదేశంలో మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే ఐటెల్ ప్యాడ్ వన్. ఈ సంవత్సరం ప్రారంభంలో ఐటెల్ ఎల్ సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా మనదేశంలో లాంచ్ చేసింది. ఇవి మనదేశంలో 4జీ కాలింగ్‌ను కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఇందులో లార్జ్ డిస్‌ప్లే, ఇతర అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా అందించనున్నారు. సూపర్ ఫాస్ట్ 4జీ వోల్టే టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


ఐటెల్ ప్యాడ్ వన్ ధర
లైట్ బ్లూ, డీప్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ట్యాబ్ కొనుగోలు చేయవచ్చు. దీని ధర మనదేశంలో రూ.12,999గా ఉంది. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఐటెల్ ప్యాడ్ వన్ అందుబాటులో ఉండనుంది. మనదేశంలో అందుబాటులో ఉన్న చవకైన ట్యాబ్లెట్ ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. ఆన్‌లైన్ క్లాసులకు ఇది బాగా ఉపయోగపడనుంది.


ఐటెల్ ప్యాడ్ వన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐటెల్ ప్యాడ్ వన్‌లో 10.1 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1280 x 800 పిక్సెల్స్‌గా ఉంది. సన్నటి అంచులు కూడా ఇందులో ఉండనున్నాయి. ఆక్టా కోర్ ఎస్సీ98631ఏ1 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఐటెల్ ప్యాడ్ వన్ పని చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ట్యాబ్లెట్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ ఏఎఫ్ కెమెరా ఉండనుంది. వెనక భాగంలో 80 డిగ్రీల వైడ్ యాంగిల్ కెమెరా కూడా అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది.


డ్యూయల్ స్పీకర్లు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, 4జీ సపోర్ట్, వాయిస్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేయడం, వైఫై, ఓటీజీ, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టును ఛార్జింగ్ కోసం అందించనున్నారు. మెటల్ బాడీతో దీన్ని రూపొందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు మాత్రమే కావడం విశేషం.


జనవరిలో కంపెనీ ఎల్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. ఇందులో ఫ్రేమ్ లెస్ డిజైన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ప్రీ ఇన్‌స్టాల్డ్ ఓటీటీ యాప్స్, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్‌లతో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. టీవీతో పాటు స్మార్ట్ రిమోట్ కూడా అందుబాటులోకి రానుంది.


గతేడాది ఐటెల్ విజన్ 3 టర్బో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ వాటర్ డ్రాప్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 


ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.7,699గా నిర్ణయించారు. డీప్ ఓషన్ బ్లూ, జ్యువెల్ బ్లూ, మల్టీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించనున్నారు.