స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు ఐఫోన్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఐఫోన్ 13పై అత్యంత చవకైన ఆఫర్ అందిస్తున్నారు. ఐఫోన్ 13లో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. వైట్, బ్లాక్, పింక్, రెడ్, బ్లూ, గ్రీన్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.


ఐఫోన్ 13 అసలు ధర రూ.79,900 కాగా... రూ.66,900కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.13,000 డిస్కౌంట్‌ను దీనిపై అందించారన్న మాట. అంతేకాకుండా రూ.18 వేలు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభించనుంది. అంటే రూ.50 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 13లో 6.1 అంగుళాల డిస్ ప్లే‌ను యాపిల్ అందించింది. డాల్బీ విజ‌న్, హెచ్ డీఆర్10, హెచ్ఎల్‌జీ స‌పోర్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. ఏ15 బ‌యోనిక్ ప్రాసెస‌ర్‌పై ఐఫోన్ 13 పనిచేయనుంది. ఫ్లాట్ ఎడ్జ్ అల్యూమినియం ఫ్రేమ్‌ల‌ను కూడా అందించారు.


ఇందులో సరికొత్త వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. ఐఫోన్ 13 కెమెరాలో నైట్ మోడ్ కూడా వేగంగా ప‌నిచేయ‌నుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను యాపిల్ ఇందులో అందించింది. ఇందులో వెన‌క‌వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఐఫోన్ 13 పూర్తి రోజు బ్యాట‌రీ లైఫ్‌ను అందిస్తుంద‌ని యాపిల్ పేర్కొంది.