iPhone 12: రూ.30 వేల బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఏకంగా ఐఫోన్‌నే కొనేయండి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ల ద్వారా యాపిల్ ఐఫోన్ 12ని రూ.30 వేలలోపే కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.


ఐఫోన్ 12పై ఆఫర్
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 12పై మంచి డీల్ అందిస్తున్నారు. ఐఫోన్ 12 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ అసలు ధర రూ. 49,999 కాగా, 19 శాతం తగ్గింపుతో రూ. 39,999కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఐఫోన్ 12పై అనేక ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇది రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్‌కి అదనం అన్నమాట.


ఐఫోన్ 12పై బ్యాంక్ ఆఫర్లు
మీరు ఐఫోన్ 12పై ఒక బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు 5 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. అంటే ఇక్కడ మీకు రూ.2,000 అదనంగా తగ్గుతుందన్న మాట. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై  ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందుతారు. దీన్ని కూడా ఉపయోగిస్తే సులభంగా రూ.30 వేలలోపు ధరకు ఐఫోన్ 12 కొనేయచ్చు.


ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు ఫీచర్లు
ఐఫోన్ 12 6.1 అంగుళాల సూపర్ రెటినా  ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1170x2532 పిక్సెల్స్ గానూ, యాస్పెక్ట్ రేషియో 19.5:9గానూ ఉంది. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఈ ఐఫోన్... యాపిల్ ఏ14 బయోనిక్ (5 ఎన్ఎం) ప్రాసెసర్‌ని కలిగి ఉంది.


ఇక కెమెరా సెటప్ పరంగా చూస్తే ఈ ఐఫోన్ వెనుక భాగంలో f/1.6 ఎపర్చర్ ఉన్న 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌ ఉన్న 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఐఫోన్ ముందు భాగంలో, f/2.2 ఎపర్చర్‌ ఉన్న 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు.


ఈ ఐఫోన్ iOS 15.4.1పై పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్ అందించారు. స్టోరేజ్ 64 జీబీ నుంచి ప్రారంభం కానుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాలంటే, ఈ ఐఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 2815 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.


మరోవైపు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ప్రారంభించిన తర్వాత యాపిల్ వచ్చే ఏడాది తీసుకురానున్న ఐఫోన్ 16 సిరీస్ గురించి వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఇప్పటికే సిద్ధం చేసిందట. తైవాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎకనమిక్ డైలీ న్యూస్‌ను వార్తను కోట్ చేస్తూ ఇచ్చిన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం యాపిల్ తన రాబోయే సిరీస్‌లో డిజైన్‌ను పూర్తిగా మార్చనుంది. అలాగే కెమెరాలో కొన్ని అప్‌డేట్స్ చేయనుంది.


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!