ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ ఇన్‌ఫీనిక్స్ (Infinix) నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ విడుదల అయింది. ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లే (Infinix Hot 10 Play) అనే కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో పాటు 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించింది. అలాగే మీడియాటెక్ హీలియో జీ35 (MediaTek Helio G35) ప్రాసెసర్‌ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 
కేవలం 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియంట్ మాత్రమే ఇప్పుడు విడుదల అయింది. దీని ధర రూ.7,999గా ఫిక్స్ చేసింది. 7 డిగ్రీ పర్పుల్, ఏగన్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్, మొరాండీ గ్రీన్ కలర్స్‌లో ఇది లభిస్తుంది. రియల్ మీ నుంచి వచ్చిన సీ11 2021 ఎడిషన్ కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. సీ11 2021 ఎడిషన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉన్నాయి. దీని ధర రూ.6,999గా ఉంది. 



పవర్ మారథాన్ టెక్నాలజీ
ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లేలో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఇందులో ఉపయోగించిన పవర్ మారథాన్ టెక్నాలజీ ద్వారా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ 25 శాతం పెరగనుంది. ఈ బ్యాటరీ కెపాసిటీ డిటైల్స్ ఇలా ఉన్నాయి.. 55 రోజులకు పైగా స్టాండ్ బై టైం, 23 గంటల నాన్ స్టాప్ వీడియో ప్లే బ్యాక్, 53 గంటల 4జీ టాక్ టైం, 44 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 23 గంటల వెబ్ సర్ఫింగ్‌ను అందించనుంది.
స్పెసిఫికేషన్లు ఇవే..



  • 6.82 అంగుళాల హెచ్‌డీ+ 720x1640 పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న డిస్‍ప్లే ఉంటుంది.

  • డిస్‍ప్లేకు NEG డైనోరెక్స్ టీ2ఎక్స్-1 ప్రొటెక్షన్ గ్లాస్ లేయర్ ఉంది.  

  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ అందించారు.

  • మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

  • స్క్రీన్ టు బాడీ రేషియో 90.66గా, యాస్పెక్ట్ రేషియో 20.5:9 గానూ ఉంది.

  • 2.3 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.

  • వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ ఉండనుంది.

  • 13 మెగాపిక్సెల్ కెమెరా, మరో ఏఐ లెన్స్ ఇందులో ఉన్నాయి.

  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ముందువైపు కూడా ఫ్లాష్ ఉంటుంది.

  • ఫోన్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఫేస్ & ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ సిస్టమ్ ఉంది.

  • ఫోన్ 0.89 సెంటీమీటర్ల మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది.

  • జీపీఎస్, డార్క్ థీమ్, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్లు కూడా ఇంటి ఉన్నాయి.