How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో మీ స్నేహితుడు లేదా కొలీగ్ ఒక ముఖ్యమైన మేసేజ్, ఫొటో లేదా డాక్యుమెంట్ పంపి, మీరు చూడకముందే డిలీట్ చేశాడనుకో, మీకు దిస్ మెసేజ్ వజ్ డిలీటెడ్ అని చూపిస్తుంది. లేదా తొందరపాటులో మీ అంతట మీరే చాట్ హిస్టరీ డిలీట్ చేసుకొని ఆందోళన చెందుతున్నారా? డిలీట్ అయిపోయిన ఆ మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. అయితే డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్‌లను తిరిగి చూడటం లేదా రికవరీ చేయడం అసాధ్యమేమీ కాదు. క్లౌడ్ బ్యాకప్ ఉన్నా, ఒక వేళ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ బ్యాక్ లేకపోయినా సరే, ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు చాలా సులభంగా ఆ మెసేజ్‌లను ఎలా పొందాలో చూద్దాం.
ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ హిస్టరీ ద్వారా రికవరీ
ఆండ్రాయిడ్ 11, ఆపై బగ్ వెర్షన్‌లలో పని చేసే స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండానే డిలీట్ అయిన మెసేజ్‌లను చదవచ్చు. దీని కోసం మీ ఫోన్‌లోని సెట్టింగ్స్ యాప్‌లోకి వెళ్లండి. నోటిఫికేషన్స్ లేదా యాప్స్ అండ్ నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేయండి. అక్కడ నిపించే నోటిఫికేషన్స్ హిస్టరీపై టాప్ చేసి దానిని ఆన్ చేయండి. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత, ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ పంపి వెంటనే డిలీట ఫర్ ఎవర్రీ వన్ చేసినా, ఆ మెసేజ్ ప్రివ్యూ మీ ఫోన్ నోటిఫికేషన్ లాగ్‌లో భద్రంగా సేవ్ అయి ఉంటుంది.
గూగుల్ డ్రైవ్ అండ్ ఐక్లౌడ్ బ్యాక్ ద్వారా చాట్ పునరుద్ధరణ
మీ వాట్సాప్ అకౌంట్‌లో డైలీ లేదా వీక్లీ బ్యాకప్ ఆన్ చేసి ఉంటే, డిలీట్ అయిన చాట్‌లను సెకన్లలో రికవరీ చేయవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్>చాట్స్>చాట్ బ్యాప్‌లోకి వెళ్లి చివరి బ్యాకప్ ఎప్పుడు జరిగిందో చెక్ చేయండి. మెసేజ్ డిలీట్ కావడానికి ముందే బ్యాకప్ ఉంటే, మీ ఫోన్ నుంచి వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. గూగుల్ పే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి వాట్సాప్‌ను తిరిగి రీఇన్‌స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి. స్క్రీన్‌పై కనిపించే రీస్టోర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్‌లు, మీడియా ఫైల్స్ తిరిగి వచ్చేస్తాయి.
లోకల్ డేటాబేస్ ట్రిక్
ఒక వేళ మీ వద్ద గూగుల్ డ్రైవ్ బ్యాకప్ లేకపోతే, ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఇంటర్నల్ స్టోరేజ్ ఆధారంగా డేటాను రికవర్ చేయవచ్చు. వాట్సాప్ ప్రతినెలా, రోజూ ఉదయం 2 గంటలకు లోకల్ బ్యాకప్ ఫైల్స్‌ను ఫోన్‌లో సేవ్ చేస్తుంది. మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్>మీడియా>com.whatsapp>whatsapp>డాటాబేస్ ఫోల్టర్‌లోకి వెళ్లండి. అక్కడ ఉన్న msgstore-YYYY-MM-DD.1.db.crypt14 ఫైల్‌లలో మీరు రికవర్ చేయాలనుకుంటున్న తేదీకి చెందిన ఫైల్‌ను ఎంచుకొని, గానిపేరును msgstore.db.crypt14గా రీనేమ్ చేయండి. ఇప్పుడు వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేసి వెరిపై చేస్తే లోకల్ ఫైల్ ద్వారా చాట్ రికవరీ అవుతుంది.
ఎక్స్‌పోర్ట్ చాట్ ఫీచర్‌తో బ్యాకప్ భద్రత
మీకు అత్యంత సన్నిహితులు, లేదా బిజినెస్ కాంటాక్ట్స్‌తో జరిపిన చాట్ డిలీట్ కాకుండా ఉండటానికి వాట్సాప్‌లోని ఇన్ బిల్ట ఎక్స్‌పోర్ట్ చాట్ ఫీచర్ అద్భుతంగా తోడ్పడుతుంది. నిర్ధిష్టమైన వ్యక్తి చాట్ బాక్స్ ఓపెన్ చేసి పైన ఉన్న ...>మోర్>ఎక్స్‌పోర్ట్ ఛార్ట్ ఎంచుకోండి. విత్‌అవుట్ మీడియా లేదా ఇన్‌క్లూడ్ మీడియా ఆప్షన్ ఎంచుకుని, ఆ మొత్తం చాట్‌ను మీ ఈ మెయిల్ లేదా గూగుల్ డ్రైవ్‌లోకి పీడీఎఫ్/టెక్స్ట్ ఫైల్‌గా పంపుకోవచ్చు.
థర్డ్ పార్టీ రికవరీ యాప్స్ వాడవచ్చా?
ప్లే స్టోర్‌లో వాట్సాప్ యాప్ డిలీట్ రికవరీ పేరిట అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటువంటి అన్ వెరిఫైడ్ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం పర్సనల్ డేటాకు అత్యంత ప్రమాదకరం. ఇవి మీ నోటిఫికేషన్‌లు, కాంటాక్ట్‌లు, ఓటీపీలను యాక్సెస్ చేసే అవకాశం ఉన్నందున, ఫోన్ ఇన్ బిల్డ్ సెట్టింగ్స్ లేదా అధికారిక క్లౌడ్ బ్యాకప్‌లను మాత్రమే ఉపయోగించడం మంచిది.
