సెల్ ఫోన్ వినియోగదారులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో నెట్ వర్క్ డ్రాపింగ్ సమస్య ముఖ్యమైనది. ఎప్పుడో ఒకసారి ఇలాంటి సమస్య ఎదురైతే ఫర్వాలేదు. కానీ, కొన్నిసార్లు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమయంలో ముఖ్యమైన కాల్స్ చేయడానికి చాలా నెట్ వర్క్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి చిరాకు కలిగిస్తుంది. ముఖ్యమైన మెసేజ్, లేదంటే ఓటీపీలు వచ్చే అవకాశం ఉంటే ఎత్తైన ప్రదేశంలో నిలబడి చేతిలో మొబైల్ పట్టుకుని తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యకు చెక్ చెప్పాలంటే ఓ మార్గం ఉంది. అదే వైఫై. Wi-Fi కనెక్షన్ అందుబాటులో ఉన్నట్లయితే ఫోన్ కాల్స్ కోసం మోబైల్ నెట్‌వర్క్ అవసరం లేదు. మీరు Wi-Fi కాలింగ్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా కాల్ మెసేజ్ సౌకర్యాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు ఆయా మొబైల్స్‌లో జస్ట్ సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. Android ఫోన్‌లలో Wi-Fi కాలింగ్‌ని ఎనేబుల్ చేసే దశలు స్మార్ట్ ఫోన్ కంపెనీని బట్టి మారుతాయి.
వైఫై కాలింగ్ కోసం చేసుకోవాల్సిన సెట్టింగ్స్
Google Pixel వినియోగదారుల కోసం
⦿ ముందుగా ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లండి.
⦿ ఇప్పుడు నెట్‌వర్క్, ఇంటర్నెట్‌పై క్లిక్ చేయాలి.
⦿ కాల్స్ మరియు SMSలోకి వెళ్లాలి.
⦿ ఇప్పుడు ఇక్కడ Wi-Fi కాలింగ్ ను ఓపెన్ చేయాలి.
⦿ Wi-Fi కాలింగ్‌ని ఉపయోగించండి అనే టోగుల్‌ని ఆన్ చేయాలి.
OnePlus వినియోగదారుల కోసం
⦿ ముందుగా మోబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
⦿ ఆ తర్వాత నెట్ వర్క్‌పై క్లిక్ చేయాలి.
⦿ అనంతరం సిమ్‌పై క్లిక్ చేయాలి.
⦿ ఇప్పుడు Wi-Fi కాలింగ్ ఎంపికను ఓపెన్ చేయాలి.
⦿ ఇప్పుడు Wi-Fi కాలింగ్ ఎంపికను ప్రారంభించండి.
⦿ ఇందులో Wi-Fi కాలింగ్, సెల్యులార్ కాలింగ్ మధ్య ఎంపికను కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సామ్ సంగ్, ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం
⦿ ముందుగా మొబైల్‌లోని సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి.
⦿ Wi-Fi కాలింగ్ ఆప్షన్ కనిపిస్తుంది.
⦿ ఇప్పుడు Wi-Fi కాలింగ్ ఎంపికకు వెళ్లి దాన్ని ఆన్ చేయాలి.
⦿ Wi-Fi నెట్‌వర్క్ మీ మొబైల్‌కి కనెక్ట్ అయినప్పుడు, కాల్ స్క్రీన్‌పై Wi-Fi కాలింగ్ వ్రాయబడిందని పాపప్ కనిపిస్తుంది.
ఐఫోన్ వినియోగదారుల కోసం
iPhoneలో Wi-Fi కాలింగ్‌ని ఆన్ చేయడానికి కింది స్టెప్స్ ఫాలో కావాలి.
⦿ ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
⦿ ఆ తర్వాత ఫోన్ లోకి వెళ్లాలి.
⦿ అనంతరం Wi-Fi కాలింగ్‌పై క్లిక్ చేయండి.
⦿ దీని తర్వాత, Wi-Fi కాలింగ్ టోగుల్‌ని ఆన్ చేయండి.
Wi-Fi కాలింగ్ సేవ అందుబాటులో ఉన్నప్పుడు, మీ iPhone స్టేటస్ బార్‌లో క్యారియర్ పేరు పక్కన మీకు Wi-Fi గుర్తు కనిపిస్తుంది. Wi-fi కాలింగ్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ మోబైల్ నెట్ వర్క్ రాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు మెసేజ్ లను పొందే అవకాశం ఉంటుంది.