మీరు కంటెంట్ క్రియేటర్ అయితే YouTube ద్వారా మనీ ఎర్నింగ్ వివరాలపై అవగాహనా పెంచుకోవడం ముఖ్యం. YouTube ప్రతి ఒక్క వీక్షణ(View)కు క్రియేటర్లకు డబ్బులు అందిస్తుంది. కానీ వీడియోకు 10 లక్షల వీక్షణలు వస్తే మీకు భారీగా డబ్బులు వస్తాయని అర్థం కాదు. వాస్తవానికి YouTube దాని క్రియేటర్లకు యాడ్స్‌పై వచ్చిన వ్యూస్‌కు డబ్బులు ఇస్తుంది. ప్రకటనకర్తల నుంచి వచ్చే మొత్తంలో YouTube 45 శాతం వాటా తీసుకుని, మిగతా 55 శాతం నగదు కంటెంట్ క్రియేటర్లకు ఇస్తుంది.
YouTube పే-పర్-వ్యూ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
ఒక నివేదిక ప్రకారం.. కంటెంట్ క్రియేటర్ మనీ ఎర్నింగ్ కోసం YouTube పే-పర్-వ్యూ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే మీ వీడియోకు వచ్చిన ప్రతి వీక్షణకు మీకు డబ్బులు రావు. దానికి ఓ లెక్క ఉంటుంది. వాస్తవానికి YouTube మీ వీడియోలో వస్తున్న ప్రకటనలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా డబ్బులు చెల్లిస్తుంది. ఉదాహరణకు మీ వీడియోకు లక్ష వ్యూస్ వచ్చినా.. దానిపై ఎలాంటి యాడ్స్ లేకపోతే మీకు డబ్బులు రావు. అదే సమయంలో మీ వీడియోకు లక్ష వ్యూస్ ఉంటే, వీడియోలో ఉన్న యాడ్స్‌కు 10,000 వ్యూస్ వస్తే.. ఈ పది వేల వ్యూస్‌కు మాత్రమే మీకు నగదు వస్తుంది.
ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మొత్తం నగదు
ఒక వీడియోలో ఒకటి కంటే ఎక్కువ యాడ్స్ ఉండి ఎక్కువ వ్యూస్ వస్తే మీకు అధికమొత్తం వస్తుంది. ఆ వీడియోకు తక్కువ వ్యూస్ వచ్చినా.. మీరు ఎక్కువ మొత్తం సంపాదిస్తారు. వాస్తవానికి YouTube ద్వారా మీకు యాడ్స్ ద్వారా మనీ వస్తుంది. అందుకే యూట్యూబ్ వీడియోలకు మనీ కావాలంటే యాడ్స్ వచ్చేలా చూసుకోవాలి. లేకపోతే ఎన్ని వ్యూస్ వచ్చినా యాడ్స్ లేకపోతే యూట్యూబ్ మీకు ఏం చెల్లించదు.
వ్యూస్ ప్రకారం ఎంత డబ్బు వస్తుంది?
వ్యూస్ ప్రకారం డబ్బులు వస్తాయని ఏ గ్యారంటీ ఉండదు. సబ్‌స్కైబర్స్, వీడియో రీచ్, ఎంగేజ్‌మెంట్ వంటి పలు విషయాలపై కంటెంట్ క్రియేటర్లకు నగదు వస్తుంది. యాడ్స్ ఉన్న వీడియోకు కంటెంట్ క్రియేటర్‌కు 1000 వ్యూస్‌కు 5-15 డాలర్లు (సుమారు 444 రూపాయల నుంచి 1330 రూపాయల వరకు) వస్తాయి. ఎక్కువ యాడ్స్ ఉన్న వీడియోకు ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు అని కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు.