ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు పలు అనవసరపు కాల్స్ మోబైల్ వినియోగదారులకు బాగా విసిగిస్తుంటాయి. కొన్ని స్పామ్ కాల్స్, మరికొన్ని మార్కెటింగ్ కాల్స్ చిరాకు కలిగిస్తుంటాయి. వాటి మూలంగా కొన్ని ముఖ్యమైన కాల్స్ స్వీకరించలేకపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తమకు వచ్చే అన్ని స్పామ్ కాల్స్, మెసేజెస్ ను బ్లాక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. మీరు మీ ఫోన్ లో డు నాట్ డిస్ట్రబ్ (DND)ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. DND ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..   


నిజానికి స్పామ్ కాల్స్  అనేవి మోసపూరిత కాల్స్. ఇవి బ్యాంక్ తో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను కొల్లగొట్టేందుకు కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటారు.  ఈ కాల్స్ ను వదిలించుకునేందుకు ఆయా నెంబర్స్ ను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ప్రతి స్పామ్ నెంబర్ ను బ్లాక్ చేయడం సాధ్యం కాదు. అయితే, ఈ స్పామ్, టెలిమార్కెటింగ్ కాల్‌లను స్వీకరించడాన్ని ఆపివేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR)ని ప్రారంభించింది. ఇది గతంలో నేషనల్ డూ నాట్ కాల్ రిజిస్ట్రీ (NDNC) స్పామ్ కాల్‌లను బ్లాక్ చేయడంలో వినియోగదారులకు సహాయపడింది. ఆయా రంగాల నుంచి వచ్చే అన్ని టెలిమార్కెటింగ్ కమ్యూనికేషన్, కాల్స్ ను ఆపడానికి వినియోగదారులు సైన్-అప్ చేసుకోవచ్చు.


మీ నంబర్‌లో DNDని యాక్టివేట్ ఎలా చేయాలంటే?


1. ముందుగా మీ SMS యాప్‌ని ఓపెన్ చేసి, START అని టైప్ చేయండి.


2. ఇప్పుడు ఈ మెసేజ్ ను 1909కి పంపండి.


3. మీ సర్వీస్ ప్రొవైడర్ మీకు కేటగిరీల లిస్టును పంపిస్తారు. ఉదా. బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, ఇతరు కేటగిరీలు.


4. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీని కోడ్‌తో రిప్లై ఇవ్వండి.   


5. మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మీ అభ్యర్థనను నిర్ధారిస్తూ మీకు ఓ మెసేజ్ పంపిస్తుంది.


6. మీ మొబైల్ లో DND సర్వీసు 24 గంటల్లో ప్రారంభమవుతుంది.


DND యాక్టివేషన్ అవసరం లేని థర్డ్-పార్టీ కమర్షియల్ కాల్‌లను మాత్రమే బ్లాక్ చేస్తుంది. మీ బ్యాంక్ నుంచి వచ్చే SMS అలర్ట్‌లు, ఆన్‌లైన్ పోర్టల్స్ కమ్యూనికేషన్‌లు, థర్డ్ పార్టీ పర్సనల్ కాలింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగదు. మీరు మీ టెలికాం సర్వీస్ ఆపరేటర్ల ద్వారా DND సేవలను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.  


జియోలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలి?


1. ముందుగా MyJio యాప్‌కి వెళ్లండి.


2. ఇప్పుడు సెట్టింగ్‌లు -> సర్వీస్ సెట్టింగ్‌లు -> DND తెరవండి.


3. కాల్స్, మెసేజ్ లు రాకుండా మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీలను ఎంచుకోండి.


Airtelలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలి?


1. ఎయిర్‌టెల్ అధికారిక సైట్‌ని - airtel.in/airtel-dnd సందర్శించండి.


2. మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.


3. కన్ఫామ్ చేయడానికి మీ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.   


4. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న వర్గాలను ఎంచుకోండి.


Viలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలి?


1. ముందుగా Discover.vodafone.in/dndని తెరవండి.


2. తర్వాత అందులో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి.


3. మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, పేరు నమోదు చేయండి.


4. మీరు మార్కెటింగ్ కాల్‌లను పొందకుండా బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీలను ఎంచుకోండి.    


BSNLలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలి?


1. మీ BSNL నంబర్ నుండి 1909కి ‘start dnd’ అనే మెసేజ్ పంపించండి.


2. మీకు వచ్చిన కేటగిరీల నుంచి బ్లాక్ చేయాలనుకుంటున్న వర్గాలను ఎంచుకోండి.


Read Also: వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్ స్టోరీగా పోస్ట్ చేయాలా? అది చాలా సింపుల్