Hide locked chats: వాట్సాప్ కొంతకాలం క్రితం ఛాట్ లాక్ ఫీచర్‌ను భారతదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని కింద మీరు మీ వ్యక్తిగత ఛాట్లను ఫోల్డర్‌లో లాక్ చేయవచ్చు. లాక్ చేసిన తర్వాత వాటిని ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే ఓపెన్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్‌తో సమస్య ఏమిటంటే, మీరు మీ మొబైల్‌కి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల ఫింగర్ ప్రింట్ లాక్‌ని యాడ్ చేసినట్లయితే వారు మీ వాట్సాప్ సీక్రెట్ ఛాట్లను కూడా చూడగలరు. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు వాట్సాప్ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను విడుదల చేసింది. దాని సహాయంతో మీరు మీ లాక్ చేసిన ఛాట్ల కోసం ఫింగర్ ప్రింట్ కాకుండా మరొక టెక్స్ట్ పాస్‌వర్డ్‌ను సెట్ చేయవచ్చు.


కొత్త అప్‌డేట్‌లో, వాట్సాప్ సెర్చ్ బార్‌లో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాక్ చేసిన ఫోల్డర్‌లను యాక్సెస్ చేయగల సౌకర్యాన్ని కంపెనీ వినియోగదారులకు అందించింది. అంటే ఇప్పుడు లాగా లాక్ చేసిన చాట్ ఫోల్డర్ పైభాగంలో కనిపించదు. మీరు దానిని మరో విధంగా హైడ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు చాట్‌ను లాక్ చేయడానికి ప్రతిసారీ ప్రొఫైల్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. ఇప్పుడు వాట్సాప్ హోం పేజీలోనే చాట్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా కూడా హైడ్ చేయవచ్చు.


మీ సీక్రెట్ ఛాట్లను దాచడానికి లాక్ చేసిన ఫోల్డర్‌కు వెళ్లాలి. ఇక్కడ మీకు కుడి వైపున మూడు చుక్కలు కనిపిస్తాయి, వాటిలో ఒకటి 'హైడ్ చాట్ లాక్ ఫోల్డర్' ఆప్షన్. మీరు దీన్ని ఆన్ చేసిన వెంటనే మీరు లాక్ చేసిన ఛాట్లు వాట్సాప్ నుంచి అదృశ్యం అవుతాయి. వీటిని యాక్సెస్ చేయడానికి మీరు సెర్చ్ బార్‌లో పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. కంపెనీ ఈ అప్‌డేట్‌ను దశల వారీగా విడుదల చేస్తుంది. మీరు ఈ అప్‌డేట్‌ను ఇంకా స్వీకరించి ఉండకపోవచ్చు. క్రమంగా వినియోగదారులందరూ ఈ కొత్త అప్‌డేట్‌ను పొందడం ప్రారంభిస్తారు.


మరోవైపు పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను పోకో ఎం6 ప్రో 5జీ సపోర్ట్ చేయనుంది. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లే ఇందులో అందించారు. పోకో ఫోన్లలో ఇదే అత్యంత భారీ డిస్‌ప్లే అని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు లాంచ్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!