Fraud Loan Apps Removed: ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఈసెట్ (ESET) పరిశోధకులు గూగుల్ ప్లేస్టోర్‌లో వ్యక్తుల వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్న 17 లోన్ యాప్‌లను కనుగొన్నారు. ఈ యాప్‌లు తమను తాము నిజమైన లోన్ యాప్‌లు  అని చెప్పుకుంటున్నాయి. ఈ నివేదిక ఆధారంగా గూగుల్ ప్లేస్టోర్ ఈ యాప్‌లను తీసి వేసింది. భారతదేశంతో సహా ఇతర దేశాల్లో ప్రజలు ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. మీరు కూడా ఈ యాప్‌లను ఉపయోగిస్తుంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి. ఈసెట్ పరిశోధకుల ప్రకారం ఈ యాప్‌లను ఇప్పటివరకు 12 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.


అనేక స్పైలోన్ యాప్‌ల గుట్టు రట్టు చేసిన ఈసెట్ పరిశోధకుడు లూకాస్ స్టెఫాంకో మాట్లాడుతూ ఈ యాప్‌ల ద్వారా మోసగాళ్ళు లోన్ యాప్‌లను విశ్వసించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. వీరు తప్పుడు పద్ధతులను అవలంబించి ప్రజలను మోసం చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని పొందుతారని అన్నారు. ఈ వ్యక్తులు లోన్ యాప్‌ల ద్వారా ప్రజలను బ్లాక్‌మెయిల్ చేయడంతోపాటు చంపేస్తామని బెదిరింపులు కూడా చేసేవారని పరిశోధకులు తెలిపారు. ప్రధానంగా ఈ యాప్‌లు మెక్సికో, ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఇండియా, పాకిస్థాన్, కొలంబియా, పెరూ, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా, సింగపూర్‌లలో ఆపరేట్ అవుతున్నాయి.


గూగుల్ తొలగించిన యాప్స్ ఇవే...
ఏఏ క్రెడిట్ (AA Kredit)
అమోర్ క్యాష్ (Amor Cash)
గుయాబా క్యాష్ (GuayabaCash)
ఈజీక్రెడిట్ (EasyCredit)
క్యాష్‌వౌ (Cashwow)
క్రెడిబస్ (CrediBus)
ఫ్లాష్ లోన్ (FlashLoan)
ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito)
ప్రెస్టమోస్ డి క్రెడిట్టో - యుమికాష్ (Prestamos De Crédito - YumiCash)
గో (Go)
ఇన్‌స్టంట్ క్రెడిట్ ప్రెస్టమో (Instant Credit Prestamo)
గ్రాండే కార్టెరా (Grande Cartera)
రాపిడో క్రెడిటో (Rápido Crédito)
ఫైనప్ లెండింగ్ (Finupp Lending)
4ఎస్ క్యాష్ (4S Cash)
ట్రూనైరా (TrueNaira)
ఈజీక్యాష్ (EasyCash)


విపరీతమైన వడ్డీ
వినియోగదారులను బ్లాక్ మెయిల్ చేయడం, చంపేస్తామని బెదిరింపులు ఇవ్వడంతో పాటు, ఈ వ్యక్తులు రుణంపై నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేసి ప్రజలను వేధిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని పరిస్థితులలో రుణం తిరిగి చెల్లించడానికి 91 రోజులకు బదులుగా ఐదు రోజుల సమయం మాత్రమే ఇస్తున్నారు. వార్షిక రుణ వ్యయం (TAC) 160 శాతం నుంచి 340 శాతం మధ్య ఉంది. ఇది కూడా చాలా ఎక్కువ. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు డివైస్‌లో సేవ్ చేసిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులను ఈ యాప్స్ వివిధ అనుమతులు అడిగాయి. కాబట్టి యాప్స్‌కు పర్మిషన్ ఇచ్చేముందు జాగ్రత్తగా ఉండాలి. అలాగే గూగుల్ ఇప్పుడు బ్లాక్ చేసిన ఈ 17 ఫ్రాడ్ లోన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. లేకపోతే మీ డేటా వారి దగ్గరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!