నాయిస్ మనదేశంలో స్మార్ట్ ఐవేర్ ఐ1ని లాంచ్ చేసింది. ఇది వినియోగదారులకు ప్రత్యేకమైన, ఫ్యాషన్ టెక్ అనుభవాన్ని అందించనుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, మ్యాగ్నటిక్ చార్జింగ్ వంటి ఫీచర్లను కూడా ఇది అందించనుంది.
నాయిస్ ఐ1 ధరనాయిస్ ఐ1 ప్రస్తుతానికి రూ.5,999కే అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ ఐవేర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీన్ని కొనుగోలు చేయాలంటే కంపెనీ నుంచి 10 అంకెల కోడ్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ రెండు ఆకారాల్లో అందుబాటులో ఉన్నాయి.
నాయిస్ ఐ1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లుఇందులో గైడెడ్ ఆడియో డిజైన్‌ను అందించారు. మ్యూజిక్ ఫ్లో కూడా వీటి ద్వారా బాగుండనుంది. యాంబియంట్ నాయిస్‌ను ఇవి బ్లాక్ చేస్తాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 9 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వీ5.1ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి.
వీటి కనెక్టివిటీ రేంజ్ 10 మీటర్లుగా ఉంది. 15 నిమిషాలు చార్జ్ చేస్తే 120 నిమిషాల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. మల్టీ ఫంక్షనల్ టచ్ కంట్రోల్స్‌ను కూడా ఇవి అందించనున్నాయి. వీటి ద్వారా వినియోగదారులు కాల్స్‌ను యాక్సెప్ట్, రిజెక్ట్ చేయవచ్చు. మ్యూజిక్ మేనేజ్ చేయడంతో పాటు వాయిస్ అసిస్టెంట్‌ను కూడా యాక్టివేట్ చేయవచ్చు. ఇవి సూర్యకిరణాల నుంచి 99 శాతం ప్రొటెక్షన్‌ను అందించనున్నాయి. వీటి లెన్స్ కంటిపై స్ట్రెయిన్‌ను కూడా తగ్గిస్తాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!