Rishi Sunak : UK మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంత్రోపిక్‌లో జాయిన్ అయ్యారు. అ సంస్థ్లో సీనియర్ సలహాదారు పాత్ర పోషించనున్నారు. AI ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను  సమాజాన్ని మరో దిశగా తీసుకెళ్తున్న టైంలో సాంకేతిక రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

Continues below advertisement

టెక్‌లో సునక్ పాత్ర

తన కొత్త పార్ట్‌టైమ్ పాత్రలలో, సునక్ మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్ రెండింటిలోనూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి పని చేస్తారు, స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలు, అవి సమాజంపై ఎలా ప్రభావం చూపుతాయనే దానిపై “ఉన్నత స్థాయి వ్యూహాత్మక ఆలోచనలు” అందిస్తారు.

పోస్ట్-మినిస్టీరియల్ నియామకాలను సమీక్షించే ప్రభుత్వ సంస్థ అయిన అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్ (ACOBA) ప్రచురించిన లేఖల ప్రకారం, ఆయన విధులు ప్రభుత్వ వ్యవహారాలపై కాకుండా వ్యూహాత్మక సలహాపై మాత్రమే దృష్టి పెడతాయి.

Continues below advertisement

“టెక్నాలజీ మన ప్రపంచాన్ని మారుస్తుందని, మన భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను చాలా కాలంగా నమ్ముతున్నాను” అని సునక్ లింక్డ్‌ఇన్‌లో అన్నారు. “ పెరుగుతున్న టెక్నాలజీ మన సమాజానికి, భద్రతకు, ఆర్థిక పురోగతికి ఎలా ఉపయోగడతాయనే వ్యూహాత్మక పరిశోధనలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్రపంచ టెక్ దిగ్గజాలతో పని చేయానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. ”

మైక్రోసాఫ్ట్ సంస్థ "దశాబ్దాలుగా ఉత్పాదకత పెరుగుదలకు చాలా చేసింది" అని అభిప్రాయపడ్డారు. ఆంత్రోపిక్ "ఎంతో ఉత్సకత ఉన్న AI ల్యాబ్‌లలో ఒకటి" అని కూడా తెలిపారు. 

“ మనం సాంకేతిక విప్లవం దశలో ఉన్నాం. దీని ప్రభావాలు పారిశ్రామిక విప్లవం మాదిరిగా చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా వేగంగా జీవితాలపై ప్రభావం చూపుతాయి." అని సునక్‌ పేర్కొన్నారు. “ జరుగుతున్న మార్పులు మనందరి జవితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా కెంపెనీలకు సీనియర్ సలహాదారుగా నా పాత్రకు న్యాయం చేయగలనని అనుకుంటున్నాను.” 

ప్రభుత్వ ప్రమేయం లేదు, ACOBA చెప్పింది

సునక్ UK విధాన చర్చల్లో పాల్గొనబోరని లేదా ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉండబోరని ACOBA క్లారిటీ ఇచ్చింది. ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయిని ఇప్పుడు నిర్వహించే విధులకు ఎలాంటి ఆంటంకం కలగదని ఓవర్‌లాప్ జరిగేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్ సంస్థలు కూడా ఆయన పనిని అంతర్గత వ్యూహాత్మక విషయాలకు పరిమితం చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. అనవసరమైన సంఘర్షణలు లేకుండా చూస్తామని కూడా పేర్కొ్నాయి.  

ఈ పదవుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా సునక్ ది రిచ్‌మండ్ ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇస్తారు. ప్రజల్లో సంఖ్యా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టును భార్య అక్షతా మూర్తితో కలిసి ఈ ఏడాది ప్రారంభించారు.  

సునక్‌కు ఆంత్రోపిక్ ప్రశంసలు

ఆంత్రోపిక్ ఒక ప్రకటనలో, "సునక్ AIతో వచ్చే మార్పులను గుర్తించిన నాయకుల్లో మొదటి స్థానంలో ఉన్నారు" అని పేర్కొది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI భద్రతా సంస్థ స్థాపించడంలో 2023లో బ్లెచ్లీ పార్క్‌లో AI భద్రతా సమ్మిట్‌ నిర్వహించడంలో ఆయన పాత్రను ప్రశంసించింది. 

"AI మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా పని చేస్తున్నప్పుడు ఆయన అనుభవం విలువైన వ్యూహాత్మక మార్గదర్శకం అందిస్తుంది" అని కంపెనీ తెలిపింది. సునక్ స్థానం ACOBA షరతులకు లోబడే ఉంటుందని అంతర్గత కంపెనీ వ్యూహంపై దృష్టి సారించిందని పేర్కొంది. 

ఆర్థికంతో సంబంధాలను కొనసాగించడం

ఇవే కాదు ఈ ఏడాది జూలై నుంచి సునక్‌ గోల్డ్‌మన్ సాచ్స్‌కు సీనియర్ సలహాదారుగా పని చేస్తున్నారు. ప్రధానమంత్రిగా వైదొలిగిన తర్వాత ఆయన తీసకున్న మొదటి నిర్ణయం అది. 

AIలో సునక్ ట్రాక్ రికార్డ్

అక్టోబర్ 2022- జూలై 2024 మధ్య ప్రధానమంత్రిగా సునక్ AI విధానాన్ని తన పరిపాలనలో కేంద్ర బిందువుగా చేసుకున్నారు. నవంబర్ 2023లో జరిగిన AI సేఫ్టీ సమ్మిట్‌లో ఆయన ప్రభుత్వం మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్‌తో కలిసి పనిచేసింది. అప్పుడే మైక్రోసాఫ్ట్ మూడేళ్లలో AI మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలలో £2.5 బిలియన్ ($3.3 బిలియన్) పెట్టుబడిని ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్ గత నెలలో రాబోయే నాలుగు సంవత్సరాలలో UKలో AI మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలకు అదనంగా £22 బిలియన్ ($30 బిలియన్) పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. Nvidia, Google కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి మాట ఇచ్చాయి.  

ఆంత్రోపిక్ గ్లోబల్ విస్తరణ

Google, Amazon సహా ప్రధాన పెట్టుబడిదారుల మద్దతుతో ఉన్న ఆంత్రోపిక్ - దాని క్లాడ్ AI మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి యునైటెడ్ స్టేట్స్ దాటి వస్తోంది. వేగంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం కంపెనీ తన మ్యాన్‌పవర్‌ను మూడు రెట్లు పెంచుకోవాలని, దాని కీలకమైన AI బృందాన్ని ఐదు రెట్లు పెంచాలని చూస్తోంది. 

డబ్లిన్, లండన్, జ్యూరిచ్ అంతటా 100 కంటే ఎక్కువ రోల్స్ క్రియేట్ చేస్తోంది. త్వరలో మరిన్ని యూరోపియన్ ప్రాంతాల్లో కార్యాలయాలు ప్రారంభించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుకోవడానికి మాజీ గూగుల్, సేల్స్‌ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ సియౌరిని ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది.  

భారత్‌లో కూడా ఆంత్రోపిక్ అడుగు పెట్టింది. ఈ మధ్యే బెంగళూరులో తన మొదటి ఆఫీస్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సహ వ్యవస్థాపకుడు డారియో అమోడీ సామాజిక, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇచ్చే బాధ్యతాయుతమైన AI అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం, ఎంటర్‌ప్రైజ్ నాయకులను కలుస్తున్నారు.