WhatsApp Tricks: వాట్సాప్ వినియోగదారుల కోసం ఛాటింగ్ అనుభవాన్ని మరింత సరదాగా, సులువుగా చేసే అనేక గొప్ప ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌లోని కొన్ని బెస్ట్ ట్రిక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీంతో మీరు ఛాటింగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుకోవచ్చు.
మెసేజ్‌ను బోల్డ్, ఇటాలిక్ లేదా స్ట్రైక్‌త్రూ చేయవచ్చు...
మీ స్నేహితులకు ఆకట్టుకునే సందేశాలను పంపడానికి వాట్సాప్‌లో టెక్స్ట్‌ను బోల్డ్, ఇటాలిక్ లేదా స్ట్రైక్‌త్రూ చేయవచ్చు. దీన్ని చేయడానికి:
బోల్డ్ టెక్స్ట్ కోసం * (స్టార్ గుర్తు)ను మెసేజ్ స్టార్టింగ్, ఎండింగ్‌లో ఉంచాలి.
ఇటాలిక్ టెక్స్ట్ కోసం _ (అండర్‌స్కోర్)ను మెసేజ్ స్టార్టింగ్, ఎండింగ్‌లో ఉంచాలి.
స్ట్రైక్‌త్రూ కోసం ఇలా ~ (టిల్డే) ఉపయోగించాలి.
లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయడం...
మీరు మీ సెక్యూరిటీని పెంచుకోవాలి అనుకుంటే మీరు ఎంచుకున్న వ్యక్తులతో మాత్రమే మీ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌ని షేర్ చేయవచ్చు. దీని కోసం మీరు సెట్టింగ్స్‌లో "ప్రైవసీ" ఆప్షన్‌ను మార్చవచ్చు. దీంతో మీకు సంబంధించిన డిటైల్స్‌ను ఎవరు చూడగలరు, ఎవరు చూడకూడదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!
నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ ఇలా...
చాలా సార్లు మనం ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ పంపాలనుకున్నా నెంబర్ సేవ్ చేసుకోకూడదు అని అనుకుంటాం. దీని కోసం మీరు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. మీ బ్రౌజర్‌లో https://wa.me/91xxxxxxxxxx (91 తర్వాత మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి) అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఇది నేరుగా వారి ఛాట్ బాక్స్‌ను ఓపెన్ చేస్తుంది. అక్కడ మీరు మెసేజ్‌ని పంపవచ్చు.
ఫేవరెట్ చేయడం ఎలా?
మనకు ఒక్కోసారి కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. తర్వాత దాన్ని కావాలి అనుకున్నప్పుడు వెతకడం కష్టం అవుతుంది. అప్పుడు ఆ మెసేజ్‌ను ఫేవరెట్ చేస్తే దాన్ని కావాల్సినప్పుడు చూసుకోవచ్చు. మెసేజ్‌ను స్టార్ చేయడానికి దానిపై ఎక్కువసేపు నొక్కి ఉంచాలి. ఆ తర్వాత పైన కనిపించిన ఆప్షన్లలో స్టార్‌ను ఎంచుకోవాలి.
ఆటో మెసేజ్‌లను కూడా సెట్ చేయచ్చు
మీరు వాట్సాప్‌ని ఎక్కువ ఉపయోగించకపోతే "ఆటో రిప్లై"ని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ప్రధానంగా వాట్సాప్ బిజినెస్ యాప్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ యాప్‌ల సహాయం కూడా తీసుకోవచ్చు. దీంతో ముఖ్యమైన సందేశాలకు సమాధానాలు ఆటోమేటిక్‌గా వెళ్తాయి. ఈ ఫీచర్లు అన్నీ ఫాలో అయితే వాట్సాప్ ఛాటింగ్ మరింత ఫన్‌గా మారనుంది.
Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!