మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్, ట్విట్టర్ బ్లూ టిక్ కోసం కంపెనీ నెలకు 8 డాలర్లను వసూలు చేస్తుందని ప్రకటించాడు. ఇందులో చాలా మంది డిమాండ్ చేసిన "వెరిఫైడ్" బ్యాడ్జ్ లేదా "టిక్" కూడా ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా డబ్బు ఆర్జించడానికి, ప్రకటనలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మస్క్ చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ సృష్టికర్తలకు రివార్డ్ కోసం ఈ నగదును ఉపయోగిస్తామని మస్క్ అన్నారు.


ట్విట్టర్‌లో బ్లూ టిక్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు
ఎలాన్ మస్క్ తెలుపుతున్న దాని ప్రకారం ట్విట్టర్‌లోని బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్‌లు రిప్లైలు, మెన్షన్లు, సెర్చ్‌లో ప్రాధాన్యత పొందుతారు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు లెంతీ వీడియోలు, ఆడియోలను పోస్ట్ చేయగలరు. అలాగే వారికి తక్కువ యాడ్లు కనిపిస్తాయి.


ట్విట్టర్ బ్లూ ఇండియాకు వస్తుందా?
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ రుసుము "దేశం కొనుగోలు శక్తి "ని బట్టి నిర్ణయిస్తామని పేర్కొన్నాడు. అంటే ఎక్కువగా మాట్లాడే ట్విట్టర్ బ్లూ ఫీచర్ భారతదేశానికి చేరుకోవచ్చు. Twitter బ్లూ సర్వీస్, వెరిఫైడ్ టిక్ కోసం ప్రస్తుత 8 డాలర్ల రుసుము మనదేశ నగదుకు మారిస్తే రూ.650గా ఉంది. అయితే తక్కువ తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీ ఈ సర్వీసును భారతదేశంలో లాంచ్ అయినట్లయితే దాని Twitter బ్లూ రుసుమును తగ్గించవచ్చు.


ట్విట్టర్‌లో బ్లూ టిక్‌తో ఎవరిని ధృవీకరించవచ్చు?
ప్రస్తుతం ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో "ముఖ్యమైన" ఖాతాలను ధృవీకరించడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ Twitter యొక్క ధృవీకరణ ప్రక్రియ విమర్శలను ఎదుర్కొంది. చాలా మంది Twitter వినియోగదారులు దీన్ని అన్యాయమైనది, ఏకపక్షమైనదని అభిప్రాయపడ్డారు. ఈ విమర్శకులలో కొందరిని మౌనంగా ఉంచేలా మస్క్ ఈ కొత్త ప్రకటన చేశాడు. ఇది Twitter మొత్తం ధృవీకరణ ప్రక్రియను పునరుద్ధరిస్తోందని పేర్కొంది. అంటే Twitterలో చాలా వెరిఫైడ్ హ్యాండిల్‌లు వారి వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను కోల్పోవచ్చు.


Twitter ప్రస్తుతం బ్లూ టిక్‌తో ఉన్న "ముఖ్యమైన" ఖాతాలను ఈ క్రింది విధంగా వర్గీకరిస్తుంది: ప్రభుత్వం, కంపెనీలు, బ్రాండ్‌లు, సంస్థలు, వార్తా సంస్థలు, పాత్రికేయులు, వినోదం, క్రీడలు, గేమింగ్, కార్యకర్తలు, శాస్త్రవేత్తలు (విద్యావేత్తలతో సహా), మత పెద్దలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?