Disney Password Sharing Rules: డిస్నీ తన కొత్త విధానాలను అమలు చేసిన తర్వాత వినియోగదారులు పాస్‌వర్డ్‌లను షేర్ చేయకుండా నిషేధించనున్నట్లు కొంతకాలం క్రితం ప్రకటించింది. ఇప్పుడు డిస్నీ ఈ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధం అయింది.


నెట్‌ఫ్లిక్స్ దారిలో డిస్నీ
కస్టమర్ల సంఖ్యను, కంపెనీ లాభాలను పెంచే లక్ష్యంతో ఈ ఏడాది జూన్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపి వేయడం ప్రారంభం అవుతుందని డిస్నీ ధృవీకరించింది. ఈ విషయంలో డిస్నీ నెట్‌ఫ్లిక్స్ అడుగుజాడలను అనుసరించడం ప్రారంభించిందని అనుకోవచ్చు. గత సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారులను పాస్‌వర్డ్‌లను షేర్ చేయకుండా నిలిపివేసింది. అయితే ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది.


నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయోజనాలను చూసిన తర్వాత డిస్నీ కూడా పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధాన్ని కూడా ప్రకటించింది. డిస్నీ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులు ఇప్పుడు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోలేరన్న విషయం తెలుసుకోవాలి. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడానికి కంపెనీ కొత్త ప్రణాళికను వెల్లడించారు. జూన్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించడంలో డిస్నీ తన మొదటి ప్రయత్నం చేయాలని యోచిస్తోందని ఆయన చెప్పారు. అయితే ఇది ప్రారంభంలో కొన్ని దేశాల్లో ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మార్కెట్‌కి పాస్‌వర్డ్ షేర్ క్రాక్‌డౌన్ రూల్‌ని విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు


జూన్‌ నుంచి కొత్త నిబంధన అమల్లోకి...
ఇంతకుముందు డిస్నీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హ్యూ జాన్‌స్టన్ మాట్లాడుతూ... మీరు ఇంట్లో వారికి కాకుండా బయటి వారికి షేర్ చేస్తున్నట్లు అనుమానం రాకపోతేనే ఓటీపీ వస్తుందని తెలిపారు. డిస్నీ నెట్‌ఫ్లిక్స్ మార్గాన్ని అనుసరిస్తుంది. డిస్నీ సీఎఫ్‌వో హ్యూ జాన్‌స్టన్ మాట్లాడుతూ తమ గొప్ప కంటెంట్ వీలైనన్ని ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.


డిస్నీ ఈ కొత్త రూల్‌ని ఎంతకాలం అమలు చేస్తుందో, ఈ కొత్త రూల్ ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. డిస్నీ తెలుపుతున్న దాని ప్రకారం పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టిన తర్వాత, వారి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. అలాగే వారి ఆదాయాలు కూడా పెరుగుతాయి.


మరోవైపు డిస్నీప్లస్, జియో సినిమా ఓటీటీ ఇకపై భారతదేశంలో కలిసి పని చేయనున్నాయి. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌పై ఇప్పటికే చాలా కాలం పాటు చర్చలు జరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డిస్నీ కలిసి కొత్త సంస్థగా ఏర్పడనున్నాయి. ఈ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్‌కు 61 శాతం వాటా లభించనుంది. భారత్‌లోని ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ రేస్‌లో ముందుండడానికి డిస్నీ... రిలయన్స్‌తో చేతులు కలపడానికి నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం గురించి వీరు త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సంబంధించిన విషయాలను కూడా బయట పెట్టకూడదని రెండు కంపెనీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది