CMF Phone 1 Sale: సీఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈ వారంలోనే లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ నేడు ప్రారంభం కానుంది. ఈరోజు (జులై 12వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు దీని సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది. ఈ ఫోన్ ఛేంజబుల్ బ్యాక్ కవర్‌తో రానుంది. అంటే వెనకవైపు కవర్‌ని మనం మార్చుకోవచ్చన్న మాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై సీఎంఎఫ్ ఫోన్ 1 రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, వైర్డ్, రివర్స్ ఛార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


సీఎంఎఫ్ ఫోన్ 1 ధర (CMF Phone 1 Price in India Flipkart)
ఈ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌ను ఉపయోగించి దీనిపై రూ.1,000 తగ్గింపు అందించనున్నారు.


Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?


సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ను కూడా అందించనున్నారు. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే ఉంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 395 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు కూడా అందించారు.


ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే ఛాన్స్ ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో 2 మెగాపిక్సెల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6 బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇందులో రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 202 గ్రాములుగా ఉంది. సీఎంఎఫ్ ఇప్పటికే మనదేశంలో పలు యాక్సెసరీలను లాంచ్ చేసింది. సీఎంఎఫ్ స్మార్ట్ వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్లు, నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్లు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.



Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు