Worldwide Active users on Social Media: ప్రస్తుతం మనందరి జీవితాల్లో ఇంటర్నెట్ కూడా భాగంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేకుండా సమయం గడవని వారు చాలా మంది మనలోనే ఉన్నారు. అదేమిటంటే రోజంతా ఇంటర్నెట్‌ని ఉపయోగించకపోతే నిద్ర కూడా పట్టని వారు ఉన్నారు.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్ల గురించి సమాచారాన్ని అందించే ఒక నివేదిక వచ్చింది. ఏఎఫ్‌పీ నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం జనాభాలో 5.19 బిలియన్ల మంది (అంటే సుమారు 519 కోట్ల మంది) ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 65 శాతం మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారన్న మాట. ఈ నంబర్‌లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3.7 శాతం వృద్ధి నమోదైంది.


ఇప్పుడు సోషల్ మీడియాలో యూజర్లు రోజుకు సగటున రెండు గంటల 26 నిమిషాల పాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారని ఏఎఫ్‌పీ తన నివేదికలో పేర్కొంది. ఇది మునుపటి కంటే చాలా ఎక్కువ. ఈ నివేదిక ప్రకారం బ్రెజిలియన్లు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతారు. వారి రోజువారీ సోషల్ మీడియా వినియోగ సమయం దాదాపు మూడు గంటల 49 నిమిషాలుగా ఉంది. జపాన్ యూజర్లు మాత్రం  సోషల్ మీడియాను రోజుకు గంట కంటే తక్కువ సమయం మాత్రమే ఉపయోగిస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా మెటా యాప్స్‌లోనే యూజర్లు అత్యంత యాక్టివ్‌గా ఉన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీని తర్వాత వీచాట్, టిక్‌టాక్, చైనాకు చెందిన డౌయిన్ యాప్స్ బాగా ఫేమస్ అయ్యాయి. దీంతోపాటు ట్విట్టర్, మెసెంజర్, టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని మెటాకు సంబంధించిన మూడు యాప్స్‌లో చాలా మంది వ్యక్తులు యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవల మెటా థ్రెడ్స్ యాప్‌ను కూడా ప్రారంభించింది. ఈ యాప్ ఇప్పటికే 150 మిలియన్ల యూజర్‌బేస్‌ను దాటింది.


అంతకుముందు ఏప్రిల్‌లో స్టాటిస్టా నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 5.18 బిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు (518 కోట్ల మంది) ఉన్నారని తెలిపారు. అంటే ప్రపంచ జనాభాలో 65 శాతం మంది సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు. 2021 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 788.84 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది.


మరోవైపు రియల్‌మీ సీ53 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో కంపెనీ 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీంతోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను రియల్‌మీ సీ53 సపోర్ట్ చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు.


Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial