Twitter vs Threads: థ్రెడ్స్ యాప్‌ను మెటా జూలై 6వ తేదీన లాంచ్ చేసింది. యాప్ ఇప్పటికే 100 మిలియన్ల యూజర్‌బేస్‌ను దాటింది. ట్విట్టర్‌కి దాని నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ యాప్ ఇటీవలే లాంచ్ అయినందున, ట్విట్టర్‌లో ఉన్నన్ని ఫీచర్లు ఇందులో లేవు. అయితే ఇన్నేళ్లుగా ట్విట్టర్ తన వినియోగదారులకు అందించలేకపోయిన కొన్ని ఫీచర్లను మెటా ఈ యాప్‌లో అందించింది. థ్రెడ్స్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు, ట్రెండింగ్ శోధన, డైరెక్ట్ మెసేజ్ (డీఎం) వంటి ట్విట్టర్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఇందులో లేవు. కంపెనీ త్వరలో యాప్‌కి అప్‌డేట్‌లను తీసుకువస్తుందని, దీని ద్వారాచాలా కొత్త ఫీచర్లను అందిస్తామని మెటా ఇప్పటికే ప్రకటించింది.
థ్రెడ్స్‌లో ప్రత్యేకంగా ఉన్న ఆరు ఫీచర్లు ఇవే:
1. ట్విట్టర్‌లో మీరు ప్రస్తుతం నాలుగు ఫోటోలు, వీడియోలను మాత్రమే పోస్ట్ చేయగలరు. అయితే థ్రెడ్స్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే 10 ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయవచ్చు
2. మీరు ట్విట్టర్‌లో ఎవరి ప్రొఫైల్ అయినా చూడకూడదు అనుకున్నా, వారితో ఇంటరాక్షన్ వద్దు అనుకున్నా బ్లాక్, అన్‌ఫాలో ఆప్షన్ల ద్వారా వారి నుంచి దూరంగా ఉండవచ్చు. థ్రెడ్స్‌లో ఈ రెండు మాత్రమే కాకుండా కంపెనీ లిమిట్ చేసే ఆప్షన్‌ను కూడా ఇస్తుంది. తద్వారా మీరు ఆ వ్యక్తికి తెలియకుండానే వారి నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేయడం ద్వారా మీరు ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ను చూడలేరు.
3. ‘టేక్ ఎ బ్రేక్’ ఆప్షన్ థ్రెడ్స్‌లో అందుబాటులో ఉంది. దీనిలో మీరు యాప్ నుంచి దూరం కావాల్సిన సమయాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఇది ట్విట్టర్ విషయంలో కాదు. అలాంటి ఆప్షన్ ట్విట్టర్‌లో అందుబాటులో లేదు.
4. నోటిఫికేషన్‌లు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడతాయి. థ్రెడ్స్‌లో నోటిఫికేషన్‌లను కొంత సమయం పాటు ఆపడానికి కంపెనీ ఆప్షన్‌ను ఇస్తుంది. మీరు గరిష్టంగా 8 గంటల వరకు నోటిఫికేషన్స్‌ను నిలిపివేయవచ్చు. ట్విట్టర్‌లో అలాంటి ఫీచర్ ఏదీ లేదు.
5. థ్రెడ్స్ ఇన్‌స్టాగ్రామ్‌కి లింక్ అయినందున మీరు పోస్ట్‌ను థ్రెడ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒకే క్లిక్‌తో షేర్ చేయవచ్చు. ట్విట్టర్‌లో ఇలా ఇతర ప్లాట్‌ఫాంల్లో చేసే అవసరం లేదు.
6. థ్రెడ్స్‌లో లాగిన్ చేయడం సులభం. మొదటిసారి సైన్ అప్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్ నుండి మొత్తం సమాచారాన్ని ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ట్విట్టర్‌లో లాగిన్ కావడం మాత్రం థ్రెడ్స్‌తో పోలిస్తే కాస్త కష్టం.
త్వరలో మరిన్ని ఫీచర్లు
కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మోస్సేరి ఒక థ్రెడ్ పోస్ట్‌లో అనేక ఫీచర్లు త్వరలో యాడ్ చేస్తామని హామీ ఇచ్చారు. మీరు ఫాలో అయ్యే వ్యక్తుల పోస్ట్‌లను చూపే టైమ్‌లైన్, పోస్ట్‌లను ఎడిట్ చేసే బటన్, పోస్ట్‌ల కోసం సెర్చ్ చేసే ఫీచర్లు రానున్నాయి. ఎడిట్ ఫీచర్ ట్విట్టర్‌లో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే బ్లూ టిక్ వినియోగదారులు మాత్రమే దీన్ని పొందుతారు.
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial