Google Account Security: ఈ రోజుల్లో డిజిటల్ ప్రయాణంలో గూగుల్ అకౌంట్ చాలా కీలకం. జీమెయిల్, గూగుల్ ఫోటోస్, డ్రైవ్, యూట్యూబ్, ఫోన్ కాంటాక్ట్స్ వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఒక్క అకౌంట్‌తోనే లింక్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ గూగుల్ అకౌంట్ సెక్యూరిటీ సెట్టింగ్‌లు బలహీనంగా ఉంటే, సైబర్ నేరగాళ్ల చేతికి మీ వ్యక్తిగత డేటా చిక్కితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మీ అకౌంట్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఈ 5 సెట్టింగ్‌లను వెంటనే చెక్ చేసుకోండి.
1. 2-స్టెప్ వెరిఫికేషన్
మీ గూగుల్ అకౌంట్‌కు రక్షణ కల్పించే అత్యంత ముఖ్యమైన విషయం.. 2-స్టెప్ వెరిఫికేషన్. దీన్ని యాక్టివేట్ చేయడం వల్ల, పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాత కూడా మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా అదనపు వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వేరొకరికి మీ పాస్‌వర్డ్ తెలిసినప్పటికీ, మీ పర్మిషన్ లేనిదే లాగిన్ చేయడం సాధ్యంకాదు.
2. గూగుల్ సెక్యూరిటీ చెకప్
గూగుల్ అకౌంట్‌లోని 'సెక్యూరిటీ చెకప్' ఫీచర్ ద్వారా మీ అకౌంట్ భద్రతను ఈజీగా చెక్ చేయవచ్చు. మీ అకౌంట్ ఏయే పరికరాల్లో లాగిన్ అయి ఉంది, ఏయే యాప్‌లు లింక్ అయి ఉన్నాయి అనేది ఇందులో తెలుస్తుంది. మీకు తెలియని లేదా మీరు ప్రస్తుతం ఉపయోగించని డివైస్‌లో ఏదైనా కనిపిస్తే, వెంటనే దాన్ని 'Sign Out' చేయడం బెటర్.
3. వీక్ పాస్‌వర్డ్‌లను మార్చండి
మీరు చాలా కాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నా, లేదా ఇతర వెబ్‌సైట్లలో వాడిన పాస్‌వర్డ్‌నే గూగుల్ అకౌంట్‌కు ఉపయోగిస్తున్నా వెంటనే దాన్ని మార్చండి. వేరొక వెబ్‌సైట్ డేటా లీక్ అయినప్పుడు అదే పాస్‌వర్డ్‌తో మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్, సింబల్స్ కలగలిపిన బలమైన పాస్‌వర్డ్‌ను మాత్రమే పెట్టుకోండి. Also Read: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
4. థర్డ్-పార్టీ యాప్స్ యాక్సెస్
చాలా రకాల యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో ఈజీగా సైన్ ఇన్ చేయడానికి 'Sign in with Google' నియోగిస్తుంటాం, ఆ తర్వాత వాటిని మర్చిపోతుంటాం. మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి థర్డ్ పార్టీ యాప్‌ల లిస్ట్ ను చెక్ చేయండి. మీరు ప్రస్తుతం ఉపయోగించని యాప్‌ల నుంచి యాక్సెస్‌ను వెంటనే రద్దు చేయండి. Also Read: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
5. రికవరీ ఫోన్, ఇమెయిల్‌ను అప్‌డేట్
పాస్‌వర్డ్‌ను మరచిపోయినా లేదా మీ అకౌంట్ హ్యాక్ అయినా తిరిగి పొందడానికి ఫోన్ నెంబర్, ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్ అవసరం. మీ అకౌంట్ లో రిజిస్టర్ చేసిన రికవరీ ఫోన్ నంబర్ ఇమెయిల్ మీరు ప్రస్తుతం వాడుతున్నారా, లేదా అనేది చెక్ చేసుకుని అప్‌డేట్ చేయండి.
ఈ 5 చిన్న మార్పులు చేయడం ద్వారా మీ గూగుల్ అకౌంట్‌ను డిజిటల్ మోసాల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు.
Also Read: ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
