BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ - 600 జీబీ ప్లాన్ ధర తగ్గింపు - ఇప్పుడు ఎంతంటే?

BSNL Best Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన రూ.1999 ప్లాన్‌పై భారీ తగ్గింపును అందించింది. ఇప్పుడు ఈ ప్లాన్ ధరను కంపెనీ రూ.100 వరకు తగ్గించింది. ఈ ప్లాన్‌తో 600 జీబీ డేటా లభించనుంది.

Continues below advertisement

BSNL Prepaid Recharge Plans: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి సందర్భంగా తన వినియోగదారులకు ప్రత్యేక బహుమతిని అందించింది. ఒక వైపు భారతదేశంలోని అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు అంటే జియో, ఎయిర్‌టెల్, వీఐ తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను నిరంతరం పెంచుతూనే ఉన్నాయి. అయితే మరోవైపు బీఎస్ఎన్ఎల్ దానికి సంబంధించి అనేక రీఛార్జ్ ప్లాన్‌ల ధరను తగ్గించింది.

Continues below advertisement

బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ గత కొన్ని నెలల్లో తన అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను తగ్గించింది. ఇప్పుడు కంపెనీ మరో ప్లాన్ ధరను రూ. 100 తగ్గించింది. బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్ ధర ఇప్పుడు రూ. 100 తగ్గింది. అంటే దీన్ని ఇప్పుడు రూ.1,899కే కొనుగోలు చేయవచ్చన్న మాట.

దీని కారణంగా ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ ప్లాన్ కోసం కేవలం రూ.1899 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ కొత్త ధరను లిస్ట్ చేసింది.

Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?

మొత్తంగా 600 జీబీ డేటా
అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఈ ఆఫర్‌ని అందించింది. కంపెనీ ఈ ఆఫర్‌ను అక్టోబర్ 28వ తేదీ నుంచి ప్రారంభించింది. ఇది నవంబర్ 7వ తేదీ వరకు అమలు కానుంది. అంటే వినియోగదారులు నవంబర్ 7వ తేదీ వరకు రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ. 1899కి కొనుగోలు చేయవచ్చు. 

ఇది బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్. దీని వాలిడిటీ 365 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్ కోసం వినియోగదారులు నెలకు రూ.158.25 మాత్రమే ఖర్చు అవుతుందన్న మాట. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తంగా 600 జీబీ డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, గేమ్స్, మ్యూజిక్ వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు.

Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Continues below advertisement