Best Phones Under Rs 30000: ప్రస్తుతం భారతీయ మార్కెట్లో చాలా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల మధ్య మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్న ఫోన్‌లను పొందవచ్చు. రూ. 10,000లోపు కూడా సాధారణ వినియోగానికి సరిపోయే అనేక మోడల్‌లు ఉన్నాయి. అనేక కంపెనీల నుంచి 5జీ ఫోన్లు కూడా భారతీయ మార్కెట్లో రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ లేదా ప్రీమియం ఫోన్ కొనాలనుకుంటే, బడ్జెట్ కొద్దిగా పెరుగుతుంది. రూ. 30 వేలలోపు ఏ ఫోన్ కొనుగోలు చేస్తే మంచిది? కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే, ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు... వీటన్నిటిలో ఏవి బెస్ట్? అన్నది తెలుసుకుందాం.


పోకో ఎఫ్5 (Poco F5)
పోకో ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ అందించింది. ఇది చాలా శక్తివంతమైన చిప్‌సెట్. అలాగే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉన్న 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించింది. యూజర్లకు అద్భుతమైన ఆడియో అనుభూతిని అందించడానికి ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్ అందించారు. ఇది గేమింగ్‌కు కూడా అనువైన మోడల్. ఈ ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్‌లో 64 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌ను అందించారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా చూడవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందించారు. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని ధర మనదేశంలో రూ.29,999 నుంచి ప్రారంభం కానుంది.


ఐకూ నియో 7 (iQoo Neo 7)
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో సబ్ బ్రాండ్‌నే ఈ ఐకూ. ఈ కంపెనీకి చెందిన పలు ఫోన్లు ఇప్పటికే భారతదేశంలో విడుదలయ్యాయి. వాటిలో ఐకూ నియో 7 కూడా ఉంది. కంపెనీ 'నియో' సిరీస్‌కు చెందిన ఈ ఫోన్ 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో వెనకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను సపోర్ట్‌ చేసే 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌పై రన్ కానుంది. పవర్ ఫుల్ గేమ్‌లను కూడా ఈ ఫోన్ ద్వారా ఆడవచ్చు. ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్, మంచి స్టీరియో స్పీకర్లు, ఫన్‌టచ్ ఓఎస్, ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర కూడా రూ. 29,999 నుంచి ప్రారంభం కానుంది.


నథింగ్ ఫోన్ (1) (Nothing Phone 1)
నథింగ్ కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన తర్వాత హైప్ మొదలైంది. ఎందుకంటే ఈ ఫోన్ లాంటి ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ ఉన్న డివైస్ ఇంతకు ముందు లాంచ్ కాలేదు. నథింగ్ ఫోన్ (1) కంపెనీ లాంచ్ చేసిన మొదటి డివైస్. ఈ ఫోన్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ ఎల్ఈడీ మాడ్యూల్‌ను కూడా కలిగి ఉంది. ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్‌లు, అలర్ట్‌ల ప్రకారం ఈ ఎల్‌ఈడీ లైట్ వివిధ రకాలుగా బ్లింక్ అవుతుంది. నథింగ్ ఫోన్ (1)లో గ్లాస్ ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్, మ్యాట్ ఫ్రేమ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్ అందించారు. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది.  ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ అందించారు. వీటిలో ప్రధాన సెన్సార్ 50 మెగాపిక్సెల్. నథింగ్ ఫోన్ (1)లో 3.5mm ఆడియో జాక్, 15W వైర్‌లెస్, 5W రిచర్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 29,999గా ఉంది.


రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12 Pro Plus)
మీరు రూ. 30,000 లోపు ఫోటోగ్రఫీ కోసం మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్‌ను మోడల్‌ను మీ విష్ లిస్ట్‌లో ఉంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో) అందించారు. అంతేకాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్‌ కూడా ఉన్నాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉన్న 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. ఈ ఫోన్‌లో మంచి క్వాలిటీ స్టీరియో స్పీకర్లు, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఈ రెడ్‌మీ ఫోన్ ధర రూ.27,999 నుంచి ప్రారంభం కానుంది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 (OnePlus Nord CE3)
ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 24,999 నుంచి ప్రారంభం కానుంది. ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్‌పై వన్‌ప్లస్ కొత్త ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉన్న 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 782జీ ప్రాసెసర్ ఉంది. హై ఎండ్ గేమింగ్ అనుభవానికి ఈ ఫోన్ మంచి ఆప్షన్. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!