Best Laptop Below 50k: ఒకప్పటి కంటే ప్రస్తుతం మనదేశంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగింది. కోవిడ్ తర్వాత ఎడ్యుకేషన్, జాబ్, ఇలా అన్నిటికీ ల్యాప్‌టాప్ అనేది అత్యవసరంగా మారిపోయింది. ల్యాప్‌టాప్‌లపై మనం చేసే పని మారుతున్నప్పుడు వాటిపై పడే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ వర్క్ లోడ్‌ను హ్యాండిల్ చేయడం కోసం ల్యాప్‌టాప్‌పై రూ.50 వేల వరకు బడ్జెట్ పెట్టడానికి కూడా ప్రజలు వెనకాడటం లేదు. రూ.50 వేలలోపు బడ్జెట్‌లో ఉన్న టాప్-5 ల్యాప్‌టాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్‌పీ15ఎస్-డీయూ3038టీయూ (HP 15s-du3038TU)
ఈ విభాగంలో హెచ్‌పీ15ఎస్-డీయూ3038టీయూ ల్యాప్‌టాప్ బెటర్ ఆప్షన్. ఇందులో i3 11వ తరం ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్‌ను అందించారు. దీని ద్వారా మల్టీ టాస్కింగ్ చేయడంతో పాటు క్విక్ డేటా యాక్సెస్ చేయవచ్చు. 15.6 అంగుళాల భారీ డిస్‌ప్లే అందించారు. అద్భుతమైన డిజైన్, ప్రొఫెషనల్ టచ్‌తో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు.
ఏసర్ యాస్పైర్ 5 (Acer Aspire 5)
బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఇది మంచి ఆప్షన్. ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్‌పై ఈ ల్యాపీ పని చేయనుంది. 512 జీబీ ఎస్ఎస్‌డీ కూడా ఇందులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ వేగంగా పని చేయనుంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, బ్యాక్‌లిట్ కీబోర్డు కూడా ఇందులో ఉన్నాయి.
లెనోవో థింక్‌ప్యాడ్ ఈ14 (Lenovo Thinkpad E14)
బెస్ట్ ల్యాప్‌టాప్ కావాలనుకునేవారికి లెనోవో థింక్‌ప్యాడ్ మంచి ఛాయిస్. ఇంటెల్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, అద్భుతమైన డిజైన్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను లెనోవో తీసుకువచ్చింది. ఈ ల్యాప్ టాప్ మంచి బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. దీని కీబోర్డు కూడా వర్క్‌కు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
డెల్ ఇన్‌స్పైరాన్ 15 3501 (Dell Inspiron 15 3501)
డెల్ బడ్జెట్ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌ల్లో ఇన్‌స్పైరాన్ 15 3501 కూడా ఒకటి. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్ ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను డెల్ ఇన్‌స్పైరాన్ 15 3501 డెలివర్ చేయనుంది. 15.6 అంగుళాల డిస్‌ప్లే ఇందులో ఉంది. మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుంది.
అసుస్ వివోబుక్ 14 (Asus Vivobook 14)
ఈ ల్యాప్‌టాప్‌లో కాంపాక్ట్ డిజైన్ అతి పెద్ద ప్లస్ పాయింట్. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. అలాగే అద్భుతమైన ఫీచర్లు కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్, 512 జీబీ ఎస్ఎస్‌డీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సన్నని అంచులు ఉన్న 14 అంగుళాల డిస్‌ప్లే ఈ ల్యాప్‌టాప్‌లో ఉండనున్నాయి. మోడర్న్, స్టైలిష్ లుక్‌ను ఇవి అందించనున్నాయి.
కాబట్టి రూ.50 వేలలోపు మంచి ల్యాప్‌టాప్ కావాలనుకుంటే వీటిలో నుంచి ఎంచుకోవడం బెటర్. వీటి కారణంగా మీ జేబుకు ఎక్కువ చిల్లు పడకుండా ఉంటుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!