గేమ్స్ ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడే వారికి హై స్పీడ్ ప్రాసెసర్ కలిగిన ఓ మంచి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. లేదంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంటుంది. మరి బడ్జెట్లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని మీరు అనుకుంటున్నారా? అందుకే మీ కోసం రూ.25,000 బడ్జెట్లో మంచి గేమింగ్ అనుభూతిని అందించే బెస్ట్ గేమింగ్ ఫోన్ల లిస్ట్‌ను తీసుకొచ్చాం. అవేంటో తెలుసుకుందాం.
Poco X6 Pro - పోకో ఎక్స్6 ప్రో 6.67 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించారు. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Mali-G615 GPU కూడా ఉంది. ఇంకా 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. షియోమి హైపర్ ఓఎస్‌తో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌ను ఆపరేట్ చేయగలదు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్లు ఉన్నాయి.
OnePlus Nord CE 4 - వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ 14 ఓఎస్‌తో నడుస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ కోసం Adreno 720 GPUను కూడా ఇచ్చారు. వెనుకవైపు 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్‌ను ఇవ్వగా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా కూడా ఇచ్చారు. ఇంకా 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ 100W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Infinix GT 20 Pro - మిడ్-రేంజ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 8200-Ultimate చిప్‌సెట్‌పై నడుస్తుంది. అలానే 8GB ర్యామ్/ 256GB స్టోరేజ్ కెపాసిటీ ఉంది. 5,000 mAh బ్యాటరీ సెటప్ కూడా కలిగి ఉంది. సులభంగా ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జన్‌ను అందిస్తోంది. ఇంకా 6.78 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ, LTPS అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ను కలిగి ఉంది.
మంచి గేమింగ్ అనుభవం కోసం మెరుగైన డిస్‌ప్లేను అందించడానికి ఎక్స్ 5 టర్బో చిపను, ఇంటిగ్రేట్ చేయడానికి పిక్సెల్ వర్క్స్‌తో కలిసి పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఇన్ఫీనిక్స్ ఎక్స్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై ఈ స్మార్ట్‌ఫోన్ నడుస్తుంది. ఇంకా, ఇన్ఫీనిక్స్ రెండు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. దీని ధర రూ.24,999 నుంచి ప్రారంభం.
Nothing Phone 2a - నథింగ్ ఫోన్ 2a మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 256GB ఇంటర్నేల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ల్పేను ఇందులో అమర్చారు. 1300 నిట్స్ బ్రైట్ నెస్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. డ్యూయెల్ స్టీరియో స్పీకర్ సెటప్, రెండు హెచ్ డీ మైక్రోఫోన్స్ కూడా అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. అలానే రెండు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. దీని ధర రూ. 23, 999.
Motorola Edge 50 Fusion - మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, పోలెడ్ కర్వ్ డిస్‌ప్లే, ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లేను కలిగి ఉంది. హై రిఫ్రెష్ రేట్ 144హెచ్‌జెడ్ 1,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్‌తో మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. ఇంకా 5జీ, 4జీ LTE, వైఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే 50ఎంపీ సోనీ-లైటియా 700సి ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, డివైజ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. 68 డబ్ల్యూ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉంది. 12GB LPDDR4X ర్యామ్, 256 GB, 2.2UFS స్టోరేజ్ కెపాసిటీతో పనిచేస్తుంది.
Also Read: రెండు బడ్జెట్ ట్యాబ్‌లు లాంచ్ చేసిన రెడ్‌మీ - రూ.13 వేలలోపే!