Apple iPad: ఆపిల్ నుంచి న్యూ ఎంట్రీ లెవల్ ఐప్యాడ్‌? లైట్నింగ్ పోర్ట్ కాదు, USB-C పోర్ట్‌ తో వస్తుందట!

ఆపిల్ నుంచి న్యూ ఎంట్రీ లెవల్ ఐప్యాడ్‌ రాబోతుంది? అదీ లైట్నింగ్ పోర్ట్ కాకుండా USB-C పోర్ట్‌ తో వస్తుందా? నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం ఎంత?

Continues below advertisement

పిల్ ఈవెంట్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.. నెట్టింట్లో కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ టెక్ దిగ్గజం.. న్యూ ఎంట్రీ లెవల్ ఐప్యాడ్‌ను ప్రకటించబోతుందని చర్చలు నడుస్తున్నాయి.   ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ ఈసారి లైట్నింగ్ పోర్ట్ కాకుండా USB-C పోర్ట్‌ తో వస్తున్నట్లు తెలుస్తున్నది. పెద్ద స్క్రీన్, సూపర్  రిజల్యూషన్‌తో క్రిస్పర్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.  A14 బయోనిక్ చిప్ ద్వారా రన్ అవుతుంది.  ఆపిల్ టాబ్లెట్ పరిమాణాన్ని 10.2 నుంచి 10.5 లేదంటే 10.9 అంగుళాల వరకు పెంచనున్నట్లు తెలుస్తున్నది.

Continues below advertisement

సెప్టెంబర్ సమీపిసస్తున్న నేపథ్యంలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 7న జరగనున్న Apple ఈవెంట్‌ లో ఐఫోన్ సిరీస్ విడుదల కానుంది. ఈ ఈవెంట్ కు సంబంధించి చాలా ఊహాగానాలు ఉన్నా iPad 2022 సిరీస్ రాక గురించి స్పెషల్ గా చర్చలు నడుస్తున్నాయి. 9To5Mac మార్క్ గుర్మాన్ ప్రకారం.. అక్టోబర్‌లో జరిగే వేరే ఈవెంట్‌లో మూడు కొత్త ఐప్యాడ్‌లను ఒక్కొక్కటిగా లాంచ్ చేయడానికి Apple ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో 10.2-అంగుళాల ఐప్యాడ్-2022, కొత్త ఐప్యాడ్ ప్రో-2022 వేరియంట్ల ఆవిష్కరణ జరగనున్నట్లు తెలుస్తోంది. Apple కొత్త MacBook Pro, Mac Pro, Mac Mini ఉత్పత్తుల మాదిరిగానే..  అదే ఈవెంట్‌ లో  కొత్త iPadలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొత్త Mac సిరీస్ M2 చిప్‌సెట్ ద్వారా రన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

బ్రూట్స్ ప్రకారం.. ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ ఈసారి లైట్నింగ్ పోర్ట్ కాకుండా USB-C పోర్ట్‌ను కలిగుంటుందని వెల్లడించింది. పెద్ద స్క్రీన్,  మెరుగైన రిజల్యూషన్‌తో క్రిస్పర్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది  A14 బయోనిక్ చిప్ ద్వారా రన్ అవుతుంది.  Apple టాబ్లెట్ పరిమాణాన్ని 10.2 నుంచి 10.5 లేదంటే 10.9 అంగుళాల వరకు విస్తరించే అవకాశం ఉంది. ఇవన్నీ బడ్జెట్ ఐప్యాడ్‌కు లేటెస్ట్ అప్‌గ్రేడ్‌ను అందిచనున్నట్లు సమాచారం

ఇక Apple ఐప్యాడ్ సిరీస్‌ లోని రెండు ప్రో మోడళ్ల గురించి తెలుసుకున్నట్లైతే..  ఇవి మరింత అద్భుతమైన  పని తీరు కోసం M2 చిప్‌ సెట్‌ను కలిగి ఉంటాయని తెలుస్తున్నది. మ్యాజిక్ కీబోర్డ్‌ తో కనెక్ట్ చేయబడినప్పుడు ప్రో మోడళ్లు తప్పనిసరిగా సాంప్రదాయ ల్యాప్‌ టాప్‌ ల యొక్క చిన్న కాపీలుగానే ఉంటాయి. ఈసారి రెండు ప్రో వేరియంట్‌ లకు చిన్న LED అందించే అవకాశం ఉంది.   అటు  Appleకు సంబంధించి  రాబోయే iPad Pro వెర్షన్‌లలో MagSafe ఛార్జింగ్‌ ని చేర్చే అవకాశం ఉంది. రెండు కొత్త ఐప్యాడ్ ప్రో వెర్షన్‌ లు గత సంవత్సరం 11-అంగుళాలు, 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో మోడల్‌ళ్లకు ప్రత్యామ్నాయంగా ఉండబోతున్నాయి. ఈ ఊహాగానాలు ఎంత మేరకు వాస్తవం అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. వచ్చే నెలలో జరిగే Apple ఈవెంట్ ఈ ఊహాగానాలనకు చెక్ చెప్పే అవకాశం ఉంది. అంత వరకు ఆగక తప్పదు.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Continues below advertisement
Sponsored Links by Taboola