Apple Removed Whatsapp: చైనా దేశంలో యాపిల్ యాప్ స్టోర్ నుంచి రెండు పెద్ద మెటా యాప్‌లను యాపిల్ తొలగించింది. ఏకంగా వాట్సాప్, థ్రెడ్స్‌ను యాప్ స్టోర్ నుంచి యాపిల్ తొలగించింది. అయితే ఇది యాపిల్ సొంత నిర్ణయం కాదండోయ్. చైనా ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ పని చేశామని యాపిల్ పేర్కొంది.


చైనీస్ ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
వాట్సాప్, థ్రెడ్స్‌ను తన యాప్ స్టోర్ నుండి తొలగించాలని చైనా ప్రభుత్వం యాపిల్‌ను ఆదేశించింది. మరి ప్రభుత్వం ఆదేశిస్తే తొలగించక తప్పుతుందా? చైనీస్ యాప్ స్టోర్ నుండి వాట్సాప్, థ్రెడ్స్ తొలగింపు గురించి యాపిల్ అధికారికంగా ప్రకటించింది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 


నివేదికల ప్రకారం చైనా ప్రభుత్వం తమ దేశ భద్రతను కారణంగా చూపుతూ ఈ యాప్‌లను తొలగించాలని యాపిల్‌ను ఆదేశించింది. అయితే మెటాకే చెందిన ఇతర మూడు యాప్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్ ఇప్పటికీ చైనాలో పని చేస్తున్నాయి. ఈ మూడు యాప్‌లు కాకుండా ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్/ట్విట్టర్, యూట్యూబ్ కూడా చైనాలో పని చేస్తున్నాయి.


చైనా సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్ణయంతోనే...
రాయిటర్స్ తాజా నివేదిక ప్రకారం యాపిల్ తన ప్రకటనలో, "చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యాప్ స్టోర్ నుంచి వాట్సాప్, థ్రెడ్‌లను తొలగించాలని ఆదేశించింది" అని పేర్కొంది. నివేదిక ప్రకారం యాపిల్ తన ప్రకటనలో ఇంకా మాట్లాడుతూ తాము వారి నిబంధనలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా ఆ దేశ నియమాలను అనుసరించాలని పేర్కొంది.



Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు


దీనిపై మెటా నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. మరోవైపు చైనా ప్రభుత్వ విభాగం కూడా దీనిపై ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇప్పుడు మెటా చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపి, చైనా యాప్ స్టోర్‌లో తన యాప్‌ను మళ్లీ లిస్ట్ చేయడానికి మార్పులు చేస్తుందో లేదో చూడాలి.