ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారందరికీ కెమెరా అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ఫోన్ పెర్ఫార్మెన్స్‌తో పాటు మంచి కెమెరా కూడా ఇందులో ఉండేలా చూసుకుంటున్నారు. తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ చక్కటి అవకాశం. రూ.10 వేలలోపు మంచి కెమెరా ఉన్న టాప్-5 స్మార్ట్ ఫోన్లు ఇవే..


అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


1. రెడ్‌మీ 9ఏ
ఈ ఫోన్ అసలు ధర రూ.8,499 కాగా, ఈ సేల్‌లో రూ.6,799కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ పొర్‌ట్రెయిట్, ఏఐ సీన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 6.53 అంగుళాల భారీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.


రెడ్‌మీ 9ఏ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


2. రెడ్‌మీ 9
ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న మరో రెడ్‌మీ ఫోన్ ఇదే. ఈ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా, ఈ సేల్‌లో రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో హెచ్‌డీఆర్, ప్రో రికార్డింగ్ మోడ్స్ ఉన్నాయి. ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 6.53 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


రెడ్‌మీ 9 కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


3. టెక్నో స్పార్క్ 7టీ (64 జీబీ)
ఈ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా.. ఈ సేల్‌లో రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.


టెక్నో స్పార్క్ 7టీ (64 జీబీ) కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


4. టెక్నో స్పార్క్ 7టీ (128 జీబీ)
ఈ ఫోన్ అసలు ధర రూ.11,999 కాగా, రూ.10,599కే అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఇంకో పది శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.10 వేలలోపే ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందులో కూడా వెనకవైపు 48 మెగాపిక్సెల్ కెమెరానే అందించారు.


టెక్నో స్పార్క్ 7టీ (128 జీబీ) కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


5. శాంసంగ్ గెలాక్సీ ఎం12
ఈ లిస్ట్‌లో ఉన్న అన్ని ఫోన్లలో బెస్ట్ డీల్ ఇదే. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా, రూ.9,499కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎం12 కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి