అమెజాన్ తన మొట్టమొదటి ఒరిజినల్ మొబైల్ గేమ్స్‌ను లాంచ్ చేయనుంది. అమెజాన్ కిడ్స్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసు ద్వారా ఇవి లాంచ్ కానున్నాయి. ఇందులో ‘సూపర్ స్పై ర్యాన్’, ‘డూ, రె అండ్ మి’ వంటి గేమ్స్ ఉండనున్నాయి. ఇవి త్వరలో ఐవోఎస్‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో సూపర్ స్పై ర్యాన్ ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా అందుబాటులోకి రానున్నాయి.


ఈ రెండు గేమ్స్ అమెజాన్ స్పెషల్స్ బేస్ మీద పని చేయనున్నాయి. అమెజాన్ కిడ్స్ ప్లస్ ప్లాట్‌ఫాం ద్వారా వీటిని ఆడవచ్చు. నెలకు మూడు డాలర్ల సబ్‌స్క్రిప్షన్‌తో పిల్లలకు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే గేమ్స్ డౌన్‌లోడ్ చేయడానికి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.


‘సూపర్ స్పై ర్యాన్’, ‘డూ, రె అండ్ మి’ వంటి గేమ్స్ తమ ప్లాట్‌ఫాంలో ఎంతో పాపులర్ కానున్నాయని అమెజాన్ కిడ్స్ ప్లస్ గ్లోబల్ హెడ్ నటాషా లిపోవాక్ తెలిపారు. కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దవారికి కూడా ఈ గేమ్స్ నచ్చుతాయని తాము ఆశిస్తున్నామన్నారు.


‘డూ, రె అండ్ మి’ అనేది ఒక మ్యూజిక్ ఎడ్యుకేషన్ గేమ్. దీని ద్వారా పిల్లలు షీట్ మ్యూజిక్ చదవడం, పియాన్ వంటి సంగీత సాధనాలు నేర్చుకోవడం వంటివి చేయవచ్చు. ఇక క్రిస్టెన్ బెల్, జాకీ టోన్ వంటి సెలబ్రిటీల వాయిస్‌లు కూడా ఈ గేమ్‌లో వినవచ్చు.


ఇక ‘సూపర్ స్పై ర్యాన్’ అనేది ఒక యానిమేటెడ్ స్పెషల్. సన్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ గేమ్‌ను డిజైన్ చేసింది. ఇందులో సింగిల్ ప్లేయర్ లేదా మల్టీ ప్లేయర్ ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు క్యారెక్టర్లను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇందులో పార్టీ మోడ్ కూడా ఉంది. ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన వినియోగదారులు ఒకరిపై ఒకరు ఆడవచ్చు.