భారత టెలికాం సర్వీస్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు మళ్లీ సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తాయని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎఫెక్ట్ అయిన వినియోగదారులు ట్విట్టర్ వేదికగా ఈ విషయమై ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరికి మొబైల్ డేటా కూడా పని చేయడం లేదని తెలుస్తోంది.


అయితే ఈ అవుటేజ్ వినియోగదారులు అందరినీ ఎఫెక్ట్ చేయలేదు. కాల్ రిసెప్షన్, సిగ్నల్ స్ట్రెంత్, మొబైల్ డేటా వంటి సర్వీసులు కొందరికి పనిచేస్తుండగా... కొందరికి మాత్రమే సమస్య తలెత్తినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ట్విట్టర్ వేదికగా కొందరు వినియోగదారులు మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారు.


ప్రస్తుతానికి ఈ అవుటేజ్ ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్లో మాత్రం ముంబై, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, గువాహటి వంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య ఉన్నట్లు చూపిస్తుంది.


డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం... మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో ఈ అవుటేజ్ ప్రారంభం అయింది. మధ్యాహ్నం 2:40 గంటల నుంచి 3:40 గంటల మధ్యలో సమస్య సద్దుమణిగిందని పలువురు వినియోగదారులు రిపోర్ట్ చేశారు. అయితే సర్వీస్ డౌన్ అయిన విషయాన్ని ఎయిర్‌టెల్ ధ్రువీకరించలేదు.














Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!