మనదేశంలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారిలో ఎక్కువమంది ప్రీపెయిడ్ కనెక్షన్లనే ఉపయోగిస్తున్నారు. అయితే పోస్ట్‌పెయిడ్ ఉపయోగించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అన్నీ పోస్ట్‌పెయిడ్ సేవలను కూడా అందిస్తున్నాయి.


ఇప్పుడు ఎయిర్‌టెల్ ఒక అల్టిమేట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు హెవీ ఇంటర్నెట్ యూజర్ అయితే ఈ ప్లాన్ మీకు ఎంతగానో ఉపయోగపడనుంది. అదే రూ.1,599 ప్లాన్. ఎయిర్‌టెల్ అందిస్తున్న హయ్యస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇదే.


ఈ ప్లాన్ ద్వారా నెలకు 250 జీబీ డేటా లభించనుంది. అంటే దాదాపు రోజుకు 8 జీబీ డేటా అన్నమాట. దీంతోపాటు రోల్ఓవర్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఒక నెల డేటా మిగిలిపోతే దాన్ని వచ్చే నెల ఉపయోగించుకోవచ్చన్న మాట. అయితే ఆ డేటా 200 జీబీని మించకూడదు. దీంతోపాటు ఈ ప్లాన్‌కు ముగ్గురిని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. యాడ్ ఆన్ చేసుకునే ప్రతి వ్యక్తికి 30 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి.


వాయిస్, ఇంటర్నెట్ లాభాలతో పాటు ఈ ప్లాన్ ఉచితంగా ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసులకు కూడా లాభాన్ని అందించనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. ఉచిత హలో ట్యూన్స్, వింక్ ప్రీమియం, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్, అపోలో సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఫాస్టాగ్ వంటి అదనపు లాభాలు కూడా పొందవచ్చు.


ఇంట్లో ఉన్న అందరికీ అంబ్రెల్లా కనెక్షన్ కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.1,599 ప్లాన్ మంచి ఆప్షన్ కానుంది. జియోలో కూడా రూ.1,499 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా నెలకు 300 జీబీ డేటాను అందించనున్నారు. కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు కూడా ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. అయితే ఈ ప్లాన్ ద్వారా కొత్త కనెక్షన్లు యాడ్ చేసుకునే ఆప్షన్ లేదు.