Airtel vs Jio Plan: ఎయిర్‌టెల్ ఇటీవల తన మొదటి నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌కు సభ్యత్వాన్ని పొందుతారు. పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ ద్వారా మీరు ఇప్పటికే అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రిలయన్స్ జియో కూడా ఎయిర్‌టెల్‌కు పోటీగా ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో అనేక ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే.


ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ. 1,199
ఇది ఎయిర్‌టెల్ నెలవారీ ప్లాన్. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 150 జీబీ డేటా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. మీరు అన్ని రకాల ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు అందించే ప్లాన్‌ని కావాలనుకుంటే, ఇది మీకు బెస్ట్ అని చెప్పవచ్చు.


ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,499
ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ కొత్తది. ఎయిర్‌టెల్ రూ. 1,499 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ నెలవారీ ప్లాన్ ధర రూ. 199గా ఉంది. అలాగే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, డైలీ 3 జీబీ డేటా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజుల వరకు ఉంది.


రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ. 1499
ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో రూ. 1499 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 జీబీ డేటా (ఎయిర్‌టెల్ ప్లాన్‌తో పోలిస్తే దాదాపు డబుల్), నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ, జియో సినిమాలకు యాక్సెస్ అందుబాటులో ఉన్నాయి. 500 జీబీ వరకు డేటా రోల్ఓవర్ చేసుకోవచ్చు.


రిలయన్స్ జియో రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో కూడా రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, ఇది ఎయిర్‌టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్‌తో పోటీ పడుతోంది. ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజుల వరకు ఉంది.


మరోవైపు జియో ఎయిర్ ఫైబర్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. దీని కోసం జియో రూ.599, రూ.899, రూ.1,199కి మూడు ప్లాన్‌లను మార్కెట్‌లో లాంచ్ చేసింది. రూ.599 ప్లాన్‌ ద్వారా 30 ఎంబీపీఎస్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. రూ.899, రూ.1,199 ప్లాన్లలో, 100 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా అందించనున్నారు. రూ.599, రూ.899 ప్లాన్‌లతో 14 ఓటీటీ యాప్స్‌కు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. రూ. 1,199 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం వంటి 16 ఓటీటీ యాప్స్‌ను పొందవచ్చు. ఈ మూడు ప్లాన్‌ల్లోనూ కస్టమర్‌లు 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను ఉచితంగా పొందుతారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!