AC Service Tips: వేసవి కాలం ప్రారంభమైన వెంటనే, ఇళ్లలోని ఎయిర్ కండిషనర్లకు పని చెబుతారు. నెలల తరబడి వాటిని ఆన్‌ చేయకుండా వదిలేసి వేసవి ఉక్కపోత మొదలైనప్పటి నుంచి ఆన్ చేస్తారు. అలా ఆన్ చేసే ముందు మొదట సరిగ్గా సర్వీస్ చేయడం మంచిది.  లేకుంటే నష్టం జరిగడమో, లేదా విద్యుత్ బిల్ ఎక్కువ రావడమో జరుగుతుంది. 

Continues below advertisement

సర్వీస్‌ విషయంలో చాలా మంది ముందుగా టెక్నీషియన్‌కు కాల్ చేస్తారు. పూర్తి వారిపైనే వదిలేస్తారు. దీని వల్ల వినియోగదారులకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే సర్వీస్ సమయంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. అప్పుడే వేసవి రోజుల్లో ప్రశాంతంగా ఉండొచ్చు.  

ముందుగా, శుభ్రపరచడంపై శ్రద్ధ పెట్టండి. విండో AC అయినా లేదా స్ప్లిట్ AC అయినా, సరైన విధంగా క్లీన్ చేయడం చాలా ముఖ్యం. విండో ACలను తీసివేసి శుభ్రం చేయాలి, అయితే స్ప్లిట్ ACలు ఎయిర్ ఫిల్టర్, ఇండోర్ యూనిట్, కూలింగ్ కాయిల్స్ నుంచి మురికిని పూర్తిగా తొలగించాలి. కాయిల్స్‌పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి చల్లదనాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. శుభ్రపరచడం అసంపూర్ణంగా వదిలేస్తే, AC సరైన చల్లధనం అందించదు. మీరు తరచుగా మళ్లీ టెక్నీషియన్ కోసం కాల్ చేయాల్సి రావచ్చు.

Continues below advertisement

చాలాసార్లు, సర్వీస్ సమయంలో, సరైన చెకింగ్‌ లేకుండా గ్యాస్ నింపమని మీకు సలహా ఇస్తారు. వెంటనే దీనికి అంగీకరించే బదులు, గ్యాస్ ప్రెజర్ చెక్ చేయించుకోండి. గ్యాస్ నిజంగా తక్కువగా ఉంటే, ముందుగా లీక్ కి కారణాన్ని గుర్తించి దాన్ని సరిచేయడం ముఖ్యం. లీక్‌ని సరిచేయకుండా గ్యాస్ నింపడం వల్ల సమస్య పునరావృతమవుతుంది. దీని వల్ల మీ జేబుకు చిల్లుపడుతుంది.  

శుభ్రపరచడంతోపాటు, పైప్‌లైన్‌ సిస్టమ్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. మూసుకుపోయిన AC డ్రెయిన్ పైపు వల్ల నీరు కారుతున్నట్లు లేదా లీక్ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తాయి. అందువల్ల, సర్వీస్ తర్వాత, నీరు సరిగ్గా వస్తుందా లేదా అనే విషయాన్ని చెక్ చేయండి. కొన్ని నిమిషాలు ACని రన్‌ చేయడం వల్ల ఇలాంటివి తెలియకపోవచ్చు. అందుకే ఎక్కువసేపు ఏసీ ఆన్‌ చేసి ఉంచడం ద్వారా ఇలాంటి లోపాలను పరీక్షించవచ్చు.

అవుట్‌డోర్ యూనిట్ పరిస్థితి ఇండోర్ యూనిట్ లాగానే ముఖ్యమైంది. అవుట్‌డోర్ యూనిట్ కండెన్సర్ రెక్కలపై దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా ఏసీ పనితీరులో మార్పు వస్తుంది. శీతలీకరణపై ప్రభావం చూపుతుంది. అవుట్‌డోర్ యూనిట్‌ను వాటర్‌ ప్రెషర్‌తో పూర్తిగా శుభ్రం చేశారని నిర్ధారించుకోండి. అవుట్‌డోర్ యూనిట్ చెత్త ఉంటే, లోపలి భాగాన్ని శుభ్రం చేయడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు కోల్పోతాయి. అందుకే రెండింటీలో కూడా ధుమ్ముధూళి లేకుండా శుభ్రం చేయించుకోవాలి. 

సర్వీస్ పూర్తయిన తర్వాత, కూలింగ్ ఎఫెక్ట్‌పై మాత్రమే కాకుండా కంప్రెసర్ సౌండ్‌పై కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు ఏవైనా అసాధారణ శబ్దాలు విన్నట్లయితే, వెంటనే ఎంక్వయిరీ చేయండి. AC సరైన మొత్తంలో కరెంట్‌ను తీసుకుంటుందో లేదో ఆంపియర్ మీటర్‌తో తనిఖీ చేయడం కూడా తెలివైన పని. ఈ విషయాలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీ AC సరిగ్గా సర్వీస్ చేశారో లేదో సీజన్ అంతటా సజావుగా నడుస్తుందని మీరు నిర్ధారించుకోగలరు.