OpenAI ChatGPTని ప్రజలు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం, చాట్ జీపీటీలో ఎక్కువగా వృత్తిపరమైన అంశాలు కాకుండా వ్యక్తిగతమైనవి అడుగుతున్నారు. గూగుల్ సెర్చ్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సమాచారం కోసం చాలా మంది చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నారని తేలింది. మునుపటి డేటా ప్రకారం గూగుల్ వినియోగదారులలో కేవలం 15% మంది మాత్రమే ఫలితాల కోసం ChatGPTని ఉపయోగిస్తున్నా, గూగుల్ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

Continues below advertisement

తాజా అధ్యయనంలో ముఖ్యమైన అంశాలు

OpenAI ఆర్థిక పరిశోధన బృందం, హార్వర్డ్ ఆర్థికవేత్త డేవిడ్ డెమింగ్ రచించిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (NBER) వర్కింగ్ పేపర్ సర్వేలో కొన్ని విషయాలు గుర్తించింది. దాని ప్రకారం, జూలై 2025లో ChatGPTతో జరిగిన సంభాషణలలో 24% సమాచారం కోసం జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 10% ఎక్కువ. ఈ పేపర్ మే 2024 నుండి జూలై 2025 వరకు 1.5 మిలియన్లకు పైగా సంభాషణలను పరిశీలించింది. యూజర్ల గోప్యతను కాపాడుతూ చాట్ జీపీటీ వినియోగాన్ని విశ్లేషించింది. పరిశోధకులు 18 ఏళ్లలోపు వారిని, తొలగించబడిన ఖాతాలను, నిషేధిత వినియోగదారులను మరియు ఎంటర్‌ప్రైజ్ ప్లాన్‌లను మినహాయించారు. అలాగే డేటాను షేర్ చేసుకోవడానికి నిరాకరించిన వారిని కూడా మినహాయించారు.

OpenAI నివేదిక ప్రకారం, 77% సంభాషణలు సమాచారం, రచనలు, ఆచరణాత్మక మార్గదర్శకత్వం అంటే చేయాల్సిన పనులపై ఓ ఐడియా గురించి ఉన్నాయి. అయితే, వినియోగదారుల వినియోగంలో కేవలం 30% మాత్రమే తమ వ్యాపరం, ఉద్యోగం, పనికి సంబంధించినవి, ఇది AI ఎంటర్‌ప్రైజ్ స్వీకరణ ఇంకా పరిమితంగా ఉందని సూచిస్తుంది. పనికి సంబంధించినవి కాని వినియోగం 53% నుండి 70%కి పెరిగింది.

Continues below advertisement

OpenAI ఇలా పేర్కొంది. “ఈ ఫలితాలు AIని ఎవరు ఉపయోగిస్తున్నారు. వారు దానిని దేని కోసం వాడుతున్నారు అనేది మాత్రమే కాకుండా, ప్రజల పని, రోజువారీ జీవితానికి ఇది ఎలా అసలైన ఆర్థిక విలువను సృష్టిస్తుందో కూడా చూపిస్తున్నాయి.”

ChatGPT ఎలా ఉపయోగిస్తున్నారంటే..

  • వ్యక్తిగతం vs పని: యువకులు, ఎక్కువ జీతం తీసుకునే నిపుణులు పనికి సంబంధించిన ఎక్కువ విషయాలు తెలుసుకున్నారు. అయితే 66 ఏళ్లు పైబడిన వారి నుండి వచ్చిన సందేశాలలో కేవలం 16% మాత్రమే పనికి సంబంధించినవి ఉన్నాయి.
  • కోడింగ్ సహాయం తగ్గింది: కోడింగ్ వంటి సాంకేతిక ఉపయోగం 12% నుండి 5%కి తగ్గింది. ఎందుకంటే ఎక్కువ మంది డెవలపర్‌లు APIలు , కొత్త AI కోడింగ్ ఏజెంట్లకు మారారు.
  • వైరల్ ట్రెండ్‌లు: ఫొటో మేకింగ్ రిక్వెస్టులు మొత్తంమీద 5% మాత్రమే పెరిగాయి, కానీ ఏప్రిల్ 2025లో Ghibli శైలి AI ఆర్ట్ ట్రెండ్ సామాజిక మాధ్యమాలలో భారీగా వినియోగించారు.
  • థెరపీ & సలహా: దాదాపు సగం (49%) ప్రాంప్ట్‌లు సలహాలపై ఆధారపడి ఉన్నాయి. కేవలం 11% చాట్‌లు వ్యక్తిగత ఫొటో లేదా ఆట గురించి ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వినియోగం: తక్కువ ఆదాయ దేశాలు ChatGPTని అధిక ఆదాయ దేశాల కంటే 4 రెట్లు ఎక్కువ వేగంతో వాడుతున్నాయి.
  • లింగ వ్యత్యాసం తగ్గుతోంది: 52% మంది వినియోగదారులు ఇప్పుడు సాధారణంగా స్త్రీలు ఉన్నారు. 2024 ప్రారంభంలో 37% నుండి భారీగా పెరిగింది.
  • యువ వినియోగదారులు: దాదాపు 46% సందేశాలు తమ వయస్సును స్వయంగా నివేదించిన 18-25 సంవత్సరాల వయస్సు వారి నుంచి ఉన్నాయి. యువత అధికంగా చాట్ జీపీటీని వాడుతోంది.

ఈ నివేదిక ChatGPT కేవలం ఆఫీసు, వర్క్ కోసం మాత్రమే కాదని సూచిస్తుంది. రోజులు గడిచేకొద్దీ ప్రజలు ChatGPTని వ్యక్తిగత సలహాలు, వ్యక్తిగత సహాయకుడిగా, వినోదానికి ఒక సోర్స్ గా మారుస్తున్నారు. కొంతమంది నిపుణులు AI ఆర్థిక విలువ గురించి జాగ్రత్తగా ఉండాలన్నారు. మీ కోసం నిర్ణయం తీసుకోవడం, ఉత్పాదకత, రోజువారీ జీవితంలో OpenAI చాట్ జీపీటీ ప్రయోజనాలు పొందుతున్నారు