AUS Vs SA: ఒక నెంబర్... వరల్డ్ కప్ లాంటి భారీ టోర్నీలో మేటి జట్టు అయిన సౌతాఫ్రికాకు రెండుసార్లు షాక్ ఇచ్చింది. ఆ నెంబరే 213. దీనికి సౌతాఫ్రికాకు లింకేంటి అనుకుంటున్నారా? ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికా ముందు బ్యాటింగ్ చేసి 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంటే ఆస్ట్రేలియా టార్గెట్ 213 పరుగులు.


దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంతలా పోరాడినా ఆస్ట్రేలియా చివరకు టార్గెట్‌ను ఛేజ్ చేసేసింది. చివర్లో మిషెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ నిలబడి ఆస్ట్రేలియా 215 పరుగులకు తీసుకెళ్లి కంగారూ జట్టును వరల్డ్ కప్ ఫైనల్ కు తీసుకెళ్లారు. అచ్చం ఇదే స్కోరుతో గతంలో ఓ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ఓడిపోయిందని మీకు తెలుసా?


1999లో ఏం జరిగింది?
అది 1999 వరల్డ్ కప్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు కూడా సెమీ ఫైనల్ లో ఈ రెండు జట్లే ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ముందు బ్యాటింగ్ చేసి సరిగ్గా 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా కూడా ఛేజింగ్ లో తడబడుతూ వచ్చి చివరికి 214 పరుగులు చేయాల్సిన 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అక్కడ మ్యాచ్ టై అయ్యింది.


అప్పటికి సూపర్ ఓవర్లు, బౌల్ అవుట్లు లేవు కాబట్టి... అంతకు ముందు దశ అంటే సూపర్ సిక్స్‌లో టేబుల్ టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు ఫైనల్‌కి వెళ్లే ఛాన్స్ ఇచ్చారు. సౌతాఫ్రికా ఈ 213 పరుగుల స్కోరు బోర్డుతోనే ఇంటి దారి పట్టింది. అచ్చం అలాంటి సీనే మళ్లీ 25 సంవత్సరాలకు రిపీట్ అవ్వటం, మళ్లీ సౌతాఫ్రికా పై ఆస్ట్రేలియానే గెలవటం..డెస్టినీ అనుకోవాలేమో.