HCA president Jaganmohan Rao arrest: ఉచిత టిక్కెట్ల కోసం ఐపీఎల్ టీం సన్ రైజర్స్ పై బెదిరింపులకు దిగిన హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్టు చేసింది. ఇప్పుడు అసలు ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికే చెల్లదన్న ఆరోపణలు వస్తున్నాయి. హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్రావు నకిలీ పత్రాలు సమర్పించినగా సీఐడీ అధికారులకు ఫిర్యాదు అందింది. శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించిన జగన్మోహన్రావు ఎన్నికల్లో పోటీ చేశారు. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేశారు. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత... ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారు. నకిలీ పత్రాలుతోనే HCA అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రావు ఎన్నికయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే HCA నిధులు దుర్వినియోగం చేశారని జగన్ మోహన్ రావు పై అభియోగాలు ఉన్నాయి. నిధులు దుర్వినియోగంపై సిఐడి కి ఫిర్యాదు చేసిన టి సి ఏ అధ్యక్షుడు గురువారెడ్డి దర్యాప్తు చేయాలని కోరారు. ధరమ్ గురవా రెడ్డి ఫిర్యాదు ఆధారంగా, సీఐడీ 2025 జూన్ 9న భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్‌లు 465 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ), 471 (నకిలీ పత్రాలను ఒరిజినల్‌గా ఉపయోగించడం), 403 (ఆస్తి దుర్వినియోగం), 409 (పబ్లిక్ సర్వెంట్ చేత నేరపూరిత విశ్వాస విచ్ఛిన్నం), 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశంతో చేసిన చర్యలు) కింద కేసు నమోదు చేసింది. జగన్మోహన్ రావు, హెచ్‌సీఏ కోశాధికారి సి.జె. శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటేలతో కలిసి సుమారు 2.32 కోట్ల రూపాయలను నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. జులై 9, 2025న జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీల్ కంటే, రాజేంద్ర యాదవ్, కవితను సీఐడీ అదుపులోకి తీసుకుంది. జగన్మోహన్రావుకు కోశాధికారి శ్రీనివాసరావు సీఈవో సునీల్ సహకరించినట్లు ఆధారాలు లభించాయి. జగన్మోహన్రావు ,శ్రీనివాసరావు, సునీత్, రాజేంద్ర యాదవ్, కవిత అరెస్ట్ చేశారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ హెచ్‌సీఏ అధికారులపై బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్, అదనపు ఉచిత టికెట్ల డిమాండ్ ఆరోపణలు చేసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు, జగన్మోహన్ రావు కార్పొరేట్ బాక్స్ (F3)ను తాళం వేసి, 20 అదనపు ఉచిత టికెట్లను డిమాండ్ చేసినట్లు SRH ఆరోపించింది. SRH ఈ బెదిరింపులపై బీసీసీఐ , ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది, హెచ్‌సీఏ బ్లాక్‌మెయిలింగ్ విధానాలను అరికట్టాలని కోరింది. తెలంగాణ విజిలెన్స్ కమిషన్ నివేదిక కూడా SRH ఆరోపణలను ధృవీకరించింది, దీని ఆధారంగా సీఐడీ చర్యలు తీసుకుంది. జగన్మోహన్ రావు బీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితులు. 2010లో అక్షర ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు. హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్‌సీఏ చాలా కాలంగా వివాదాల్లో మునిగి తేలుతోంది. అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి.