Rohit Sharma ODI Records: టీమిండియాలో ఎలాంటి కోల్డ్ వార్ జరగకుండా బీసీసీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ తరువాత కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నానని విరాట్ కోహ్లీ ముందుగానే ప్రకటించాడు. పొట్టి ప్రపంచ కప్ తరువాత రోహిత్ శర్మ టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తాజాగా విరాట్ కోహ్లీని తప్పిస్తూ రోహిత్ శర్మకు వన్డేల్లోనూ బాధ్యతలు అప్పగించింది.
బీసీసీఐ ఇచ్చిన గడువు ముగిసినా విరాట్ కోహ్లీ తప్పుకోకపోవడంతో.. మేనేజ్‌మెంట్ అతడ్ని తప్పించింది. రోహిత్ శర్మకు పూర్తి స్థాయిలో వైట్ బాల్ కెప్టెన్సీ లభించినట్లయింది. టెస్టుల్లో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు కొనసాగించనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒక్క కెప్టెన్ ఉండటమే కరెక్ట్ అని భావించిన బీసీసీఐ హిట్ మ్యాన్‌కు వైట్ బాల్ కెప్టెన్సీ లభించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ పేరిట ఎన్నో అరుదైన ఘనతలున్నాయి.
రోహిత్ శర్మ వన్డే రికార్డ్స్..
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్ పేరిటే ఉంది. 2014లో శ్రీలంకతో జరిగిన ఓ వన్డేలో 264 పరుగులు చేశాడు.
వన్డే ఫార్మాట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్. రోహిత్ వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు బాదేశాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు, 2014లో 264 పరుగులు, 2017లో 208 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఓ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు రోహిత్ బాదాడు. ఒకే వన్డేలో ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు కొట్టాడు.
వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక శతకాలు (5) రోహిత్ సాధించాడు.
వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లో శతకం బాదిన బ్యాట్స్‌మెన్, ఓపెనర్‌గా అరుదైన ఘనత.
రోహిత్ శర్మ 227 వన్డేల్లో 29 శతకాలు, 43 అర్ధశతకాల సాయంతో 48.96 సగటుతో 9,205 పరుగులు సాధించాడు
Also Read: Vinod Kambli Complaint: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి చేదు అనుభవం.. పోలీసుల్ని ఆశ్రయించిన సచిన్ బాల్య మిత్రుడు
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
Also Read: Virat Kohli refused: దిగిపోయేందుకు ఒప్పుకోని కోహ్లీ..! విధిలేక వేటు వేసిన బీసీసీఐ.. భారత క్రికెట్లో అనూహ్య పరిణామాలు!