Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో తాను నిర్మించబోయే బాడ్మింటన్ అకాడమీకి భూమి పూజ చేశారు ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీ చంద్. అమరావతిలోని అబ్బరాజు పాలెంలో 12 ఎకరాల భూమిని అకాడమీ నిర్మాణానికి ఫ్రీహోల్డ్ బేసిస్ మీద CRDA కేటాయించింది. దీనికి సంబందించిన ఒప్పందం 2017లోనే జరిగింది. ఇప్పడు అ భూమిలో అంతర్జాతీయ సౌకర్యాలతో " పుల్లెల గోపీ చంద్ బాడ్మింటన్ అకాడమీ " నిర్మాణానికి భూమి పూజ చేశారు గోపీ చంద్. ఈ కార్యక్రమంలో గోపీచంద్ కుటుంబ సభ్యులు, అధికారులు, పలువురు క్రీడాకారులు, అతిథులు పాల్గొన్నారు.

Continues below advertisement

భూమి పూజ తర్వాత గోపీ చంద్ మాట్లాడుతూ తాను నిర్మిస్తున్న  అకాడమీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ, మౌలిక క్రీడా సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు.  అథ్లెట్‌లకు విశిష్ట శిక్షణ కార్యక్రమాలు, ప్రపంచ స్థాయి ఇండోర్ కోర్టులు, శిక్షణ సదుపాయాలు, తదితర క్రీడాసంబంధిత కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ వేదికగా అమరావతిలో నిర్వహిస్తామని గోపీచంద్ స్పష్టం చేశారు. అకాడమీ నిర్మాణం పూర్తయ్యాక దక్షిణ భారతదేశంలో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ శిక్షణకు అమరావతి ప్రధాన కేంద్రంగా నిలవడమే కాక రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుందని గోపీచంద్ అన్నారు.

గోపీ చంద్‌కి అండగా ఉంటాం :CRDA

"పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ" నిర్మాణ పనులు అనుకున్న కాలవ్యవధిలో పూర్తి కావడానికి అవసరమైన సహకారం అన్నివిధాలుగా అందిస్తామని, అమరావతిని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దడంలో కట్టుబడి ఉన్నామని APCRDA అధికారులు తెలిపారు. 'పద్మభూషణ్' పురస్కార. గ్రహీత పుల్లెల గోపీ చంద్ తాను నిర్మిస్తున్న అకాడమీ ద్వారా ఎంతోమంది తెలుగు క్రీదాకారులను బ్యాండ్మింటన్ క్రీడ లో  ఉన్నత స్థానాలకు చేరుకునేలా ట్రైనింగ్ ఇస్తారని భావిస్తున్నట్టు వారు చెప్పారు.

Continues below advertisement

ఫ్రీ హోల్డ్ బేసిస్ అంటే ఏమిటి.. ఎకరా ఎంతకు ఇచ్చారంటే!

పుల్లెల గోపీచంద్ కు బాడ్మింటన్ అకాడమీ నిర్మాణం కోసం 2017 లోనే 12 ఎకరాలు కేటాయిస్తున్నట్టు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరా 10 లక్షల చొప్పున ఈ 12 ఎకరాలు అకాడమీకి కేటాయించారు. అయితే ఇది ఫ్రీ హోల్డ్ బేసిస్ అని అధికారులు తెలిపారు. అంటే ఒక్కసారి భూమిని గోపీ చంద్ కి ఇచ్చాక దానిపై పూర్తి అధికారాలు ఆయనకే ఉంటాయి.దాన్ని ఆయన భవిష్యత్ లో అమ్మొచ్చు, వేరేవారికి ట్రాన్స్ ఫర్ చేయొచ్చు లేదా తన వారసులకు అప్పజెప్పొచ్చు. అదే సమయం లో ఆ భూమి కి సంబందించిన అన్ని బాధ్యతలూ గోపీ చంద్ భరించాలి, అక్కడ నిర్మించే అకాడమీ ఖర్చు మొత్తం అయనదే. దాని మైయిటెనెన్స్, రిపేర్స్ వంటి భారం అయనదే.  అయితే పూర్తి స్థాయి అధికారం గోపీచంద్ కే ఇస్తారు కాబట్టి ఫ్రీ హోల్డ్ బేసిస్ లో ఇచ్చే భూమి ధర లీజ్ బేసిస్ లో ఇచ్చే భూమి ధర కంటే ఎక్కువ ఉంటుంది. గోపీచంద్ కు దాన్ని ఎకరాకు 10 లక్షల చొప్పున కేటాయించారు.