R Praggnanandhaa shocks Fabiano Caruana:  భారత యువ సంచలనం  ప్రజ్ఞానంద(Praggnanandhaa) నార్వే టోర్నమెంట్(Norway Chess tournament )​లో తన సత్తా చాటాడు.  నిన్న గాక మొన్న ఇదే  టోర్నీలో రౌండ్ 3 లో ప్రపంచ నెం.1 కార్ల్​సన్​(Magnus Carlsen)ను  చిత్తు చేసిన ప్రజ్ఞానంద ఇప్పుడు  తాజాగా వరల్డ్​నెం. 2 ఫాబియానో కరువానా(Fabiano Caruana)ను  ఓడించాడు. దీంతో  క్లాసికల్ చెస్‌లో టాప్ లో ఉన్న ఇద్దరి ఆటగాళ్లను ఓడించినట్టు అయ్యింది. ఇలాంటి ఫీట్ చేయటం ప్రజ్ఞానందకు ఇదే తొలిసారి.  అయితే నాల్గవ రౌండ్లో  ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన హికారు నకమురాపై ఓడిపోయాడు. ఒక ఐదో రౌండ్లో   ప్రజ్ఞానంద ఫాబియానోతో ఆదివారం తలపడ్డాడు.  ఇక ఈ టోర్నీలో 5 రౌండ్లు ముగిసేసరికి ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. వరుసగా టాప్‌ ప్లేయర్లను ఓడించడం ద్వారా  ప్రజ్ఞా అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌10లోకి దూసుకొచ్చాడు. నాలుగు ర్యాంకులను మెరుగుపర్చుకొని పదో స్థానం సాధించాడు. టోర్నీలో మరో ఐదు రౌండ్లు జరగాల్సి ఉంది. మరోవైపు, అతని సోదరి  వైశాలి దిగ్గజ క్రీడాకారిణి, స్వీడన్‌కు చెందిన  పియా క్రామ్లింగ్‌ను ఓడించడం ద్వారా తన  ఆధిక్యాన్ని మొత్తం 8.5 పాయింట్లకు పెంచుకుంది.




భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై   తన సత్తా చాటాడు. వరుసగా వరల్డ్  టాప్‌ ప్లేయర్లను ఓడించడం ద్వారా అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌  ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగు ర్యాంకులను మెరుగుపరుచుకొని టాప్‌10లోకి దూసుకొచ్చాడు. మూడవ రౌండ్లో  తెల్లపావులతో  బరిలో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ ఆట కట్టించాడు.  నాల్గవ రౌండ్ లో హికారు నకమురాపై ఓడిపోయినప్పటికీ మళ్ళీ  పుంజున్న ఈ యువ ఆటగాడు 5 వ రౌండ్లో  ఫాబియానోపై  విజయాన్ని సాధించాడు.   దీంతో ప్రస్తుతం ఈ టోర్నీలో ఐదు రౌండ్లు ముగిసేసరికి 8.5 పాయింట్లతో ప్రజ్ఞానంద మూడో స్థానంలో ఉన్నాడు. మరో ఐదు రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ప్రజ్ఞానంద విజయంపై పలువురు ప్రముఖులు సైతం స్పందించారు.   పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాఈ వ సంచలనంపై ప్రశంసలు కురిపిస్తూ ‘ఎక్స్‌’  వేదికగా పోస్టు పెట్టారు.



మరోవైపు మహిళల ఈవెంట్ లో  భారత క్రీడాకారిణి,  ప్రజ్ఞానంద సోదరి  ఆర్ వైశాలి తన అద్భుత ప్రదర్శనను కొనసాగించింది, ఆర్మగెడాన్ గేమ్‌లో చైనాకు చెందిన టింగ్జీ లీని ఓడించి 10 పాయింట్లతో ఆధిక్యాన్ని కొనసాగించింది. తన ఆధిక్యాన్ని మొత్తం 8.5 పాయింట్లకు పెంచుకుంది. భారత మహిళల చెస్ గ్రాండ్‌మాస్టర్ హంపీ 4వ రౌండ్‌లో అన్నా ముజిచుక్‌ తో జరిగిన క్లాసికల్ గేమ్‌లో ఓడిపోయింది.